Met Gala
-
ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్‌గా మార్చింది..
మెట్‌గాలా 2026లో ఎందరో ట్రెండ్ సెట్టింగ్, రికార్డ్ మేకింగ్ లుక్స్‌ని అందించారు. చాలామంది వివిధ రకాల ఫ్యాషన్ వేర్లతో సందడి చేశారు. ఎందరో సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించిన యాక్సెసరీలు, కళాత్మక డిజైనర్ వేర్లు చర్చనీయాంశంగా మారాయి. వారిలో ఒక మహిళ మాత్రం అందర్నీ ఆకర్షించేలా సన్సేషన్‌గా మారింది. ఈ అమ్మాయి లుక్‌ని చూడగానే టాలీవుడ్ మూవీ మురారీలోని "బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో" అనే పాట ఠక్కున గుర్తుస్తోంది. అయితే ఆమె కథ తెలిస్తే మాత్ర కన్నీళ్లు జలజల వచ్చేస్తాయ్. ఆ బాధను దిగమింగి అజేయంగా నిలబడి ఎదగాలన్న ఆమె తపన చూస్తే స్థైర్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. చిన్నచిన్న సమస్యలకే సతమతమై ప్రాణాలకు తీసుకునే యవతకు ఆమె కథ ఓ స్ఫూర్తి.ఆ ధీర మహిళే అమెరికన్ మోడల్ లారెన్ వాసర్. ఆమె మే4న న్యూయార్క్ నగరంలోని మెట్ గాలా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో బంగారు రంగు ప్రబల్ గురుంగ్ సూట్ ధరించి వచ్చింది. ఇందులో పెద్ద సన్సేషన్ ఏముంది అనుకోకండి. ఆమె ఈ వేడుకలో నిజమైన బంగారు కృత్రిమ కాళ్లతో వచ్చింది. అందరు ఈ వేడుకలో ఆర్టిఫిషయల్ యాక్సెసరీలతో రెడ్‌కార్పెట్‌పైకి రాగా ఆమె మాత్రం నిజమైన "బంగారు కాళ్ల"తో వచ్చి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అంతేగాదు దీని కారణంగానే లారెన్‌కు "బంగారు కాళ్ల అమ్మాయి" ముద్దు పేరు కూడా వచ్చింది.లారెన్ వాసర్ ఎవరు?లారెన్ వాసర్ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మోడల్. 38 ఏళ్ల లారెన్ వోగ్, గ్లామర్ అండ్ హార్పర్ బజార్ వంటి ఫ్యాషన్ పత్రికల ముఖచిత్రంగా ఫోజులిచ్చింది కూడా. అంతేగాదు 2017లో ఫోర్బ్స్ అండర్ 30 పురస్కార గ్రహీతగా కూడా ఎంపికైంది అలాగే 2023లో గ్లామర్ జర్మనీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిలిచారామె. 2023లో 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..లారెన్ తన కథను పంచుకోవడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. సడెన్‌గా ఒక రోజు నిద్రలోనే కోమాలోకి వెళ్లి మృత్యువు అంచులదాక వెళ్లింది. సకాలంలో ఆమె కుటుంబ సభ్యులు చూడకపోతే లారెన్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయుండేవి. ఏం జరిగిందో తెలియదు. లారెన్ గదిలోకి వచ్చేప్పటికీ అపస్మారక స్థితలో బెడ్‌పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా...అక్కడ ఆమె బతికే అవకాశాలు చాల తక్కువని తేల్చేశారు వైద్యులు. పాదాలు నల్లగా మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులన్నీ లారెన్స్ శరీరంలో చూస్తుండగానే చోటుచేసుకోవడం మొదలైంది. ఆమె పాదాలు నల్లగా అయిపోవడం ప్రారంభించింది. కానీ ఆమె తల్లిదండ్రుల తమ కూతర్ని ఏదోలా బతికించమని వైద్యులని వేడుకోవడంతో డాక్టర్లు తమ సాయశక్తులా కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రాణం కాపాడేందుకే మొదట నీలం రంగులోకి మారిపోతున్న కుడికాలుని తొలగించారు. ఆమెకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్(టీఎస్ఎస్)గా పిలిచే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు వైద్యులు. ఇది ఒక నిర్ధిష్టమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాల వల్ల కలిగే అరుదైన ప్రాణాంతక వ్యాధి. ఆ తర్వాత ఆమె శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి కొన్ని రకాల ద్రవాలను పంపించారు వైద్యులు. దాంతో జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎడమ కాలుని కూడా తొలగించారు వైద్యులు. దాంతో సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాలు వీల్‌చైర్‌కి పరిమితమైపోయిందది. జీవితం ముగిసిపోయింది ఇంకేమి లేదనుకున్న నైరాశ్యంలో ఉన్న లారెన్‌కు 14 ఏళ్ల తమ్ముడిని చూడగానే కొత్త ఆశ రేకెత్తింది. కనీసం వాడి బాగోగులు చూసుకోవడం కోసమైన బతకాలని నిర్ణయించుకుని తన సమస్యను అంగీకరించడం మొదలుపెట్టింది. అలా మోడల్లో నెమ్మది నెమ్మదిగా రాణిస్తూ..దివ్యాంగుల్లో స్ఫూర్తిని రగులుస్తోందామె. ఇంతకీ లారెన్‌కి సోకిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే?టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (టీఎస్ఎస్) అంటే టాంపోన్ వాడకంతో సంబంధం కలిగి వ్యాధి. ఇక్కడ టాంపోన్ అంటే టాంపోన్ (Tampon) అనేది ఋతుస్రావం సమయంలో (Periods) వెలువడే రక్తాన్ని పీల్చుకోవడానికి యోనిలోకి చొప్పించే ఒక చిన్న, పత్తి లేదా ఇతర శోషక పదార్థాలతో చేసిన స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తి. ఇది ప్యాడ్లకు భిన్నంగా, ఇది శరీరం లోపల ఉంటుంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది గంటలకు మించి ఉంచకూడదు. లేదంటే దీనిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ బాక్టీరియా రక్తప్రవాహంలో విషపదార్థాలను విడుదల చేసి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికారణంగా తీవ్రమైన అవయవ నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.🇬🇧🩸🦿 Beaucoup l’ont vue au Met Gala sans savoir qu’elle a PERDU ses 2 jambes à cause d’un TAMPON HYGIÉNIQUE.Lauren Wasser était une mannequin de 24 ans en pleine ascension lorsqu’un simple tampon a failli lui coûter la vie. En octobre 2012, elle s’est couchée fiévreuse et a… pic.twitter.com/bJcysI84Ah— Cultination (@Cultination1) May 11, 2026 ఈ సిండ్రోమ్ లక్షణాలు:తక్కువ రక్తపోటుతల తిరగడం, మగతగా ఉండటం లేదా స్పృహ కోల్పోవడంనీళ్ల విరేచనాలుఅకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలువికారం లేదా వాంతులుపాదాల అరికాళ్ళు లేదా చేతుల అరచేతులపై చర్మం పొట్టులా ఊడిపోవడంకళ్ళు, గొంతు ఎర్రబడటంతీవ్రమైన ఎండదెబ్బలాంటి దద్దుర్లు లేదా చర్మంపై ఎర్రటి చుక్కలుఆ ఘటనతో రాబిన్ డేనియల్సన్ చట్టంఆ వ్యాధి తన జీవితాన్ని మార్చేయడంతో లారెన్ రాబిన్ డేనియల్సన్ అనే ఋతుస్రావ సంరక్షణ ఉత్పత్తుల భద్రతా చట్టాన్ని తీసుకొచ్చేలా పాటుపడింది. పైగా దానికి మద్దతుదారిగా మారింది. ఇది ఋతుస్రావ ఉత్పత్తులలో తరచుగా కనిపించే రసాయనాలు, సింథటిక్ ఫైబర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)ను ఆదేశించే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఒక US బిల్లు.(చదవండి: అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?) -
'మెట్ గాలా'కి ఒకవేళ తెలుగు హీరోలు వెళ్తే? (ఫొటోలు)
-
బిజినెస్ ఉమెన్ @ మెట్ మెరుపులు
ఒకప్పుడు మోడల్స్‌కు, సినీతారలకు మాత్రమే పరిమితమైన గ్లామర్ వేదికలపై ఇప్పుడు మహిళా వ్యాపారవేత్తలు కూడా మెరుస్తున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు ఫ్యాషన్ మెరుపుల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా న్యూయార్క్‌లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ రెడ్ కార్పెట్‌పై నిర్వహించిన మెట్‌గాలా ఫ్యాషన్ ఈవెంట్ మరోసారి గ్లామరస్ బిజినెస్ టైకూన్స్ మెరుపులకు పట్టం కట్టింది. ఒక్కొక్కరు ఒక్కోరకమైన విశేషాల వస్త్రధారణతో ర్యాంప్‌పై తళుక్కుమన్నారు.కోట్ల విలువైన వజ్రాభరణాలతో...ప్రముఖ వ్యాపార సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్– ఇన్ఫ్రాస్ట్రక్చర్స్’ సంస్థకు చెందిన వ్యాపారవేత్త సుధారెడ్డి, న్యూయార్క్ నగరంలో జరిగిన మెట్ గాలా ఈవెంట్లో సెన్సేషన్‌గా నిలిచారు. భారతీయ వస్త్ర సంప్రదాయాలను ముఖ్యంగా తెలంగాణ వస్త్రశైలుల విశిష్టతను చాటిచెబుతూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఈ సంవత్సరపు ‘కాస్ట్యూమ్ ఆర్ట్’ థీమ్‌కు అనుగుణం గా, ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ పేరుతో ఆమె వస్త్రధారణను బాలీవుడ్ టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ప్రఖ్యాత సెలబ్రిటీ స్టైలిస్ట్ మారియల్ హేన్ సంయుక్తంగా రూపొందించారు. దీనికితోడు దాదాపు 126 కోట్ల విలువైన ఆభరణాలు సైతం ధరించి ఆమె అందరి దృష్టిని మరింతగా ఆకర్షించారు. ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ అని పేర్కొనే 550 క్యారెట్ల భారీ ముదురు ఊదా–నీలం రంగు టాంజనైట్, విక్టోరియన్ శైలి వజ్రాల నెక్లెస్ వీటిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదరహో ... అంబానీ...ఇదే మెట్ గాలాకు ప్రముఖ వ్యాపార కుటుంబం అంబానీ ఫ్యామిలీ నుంచి ఇషా అంబానీ హాజరయ్యారు. ఆమె స్వదేశ్ కళాకారుల సహకారంతో డిజైనర్ గౌరవ్ గు΄్తా రూపొందించిన కస్టమ్ కౌచర్ చీరను ధరించారు. స్వచ్ఛమైన బంగారు దారాలతో నేసిన ఈ చీరపై, లేత బంగారం మట్టి రంగులలో చేతితో చిత్రించిన పిచ్వాయి–ప్రేరిత మోటిఫ్‌లు ఉన్నాయి. ఈ డిజైన్, చీరను ఒక శిల్పంలాంటి డ్రేప్‌తో, ఒక కళాత్మక రూపంగా ఆవిష్కరించింది. భారతీయ కళాకారుల చేతుల మీదుగా బంగారంతో నేసిన ఈ చీర పైభాగానికి, వస్త్రంపై 200కు పైగా పాతకాలపు వజ్రాలను చేతితో కుట్టారు. ఇవన్నీ ఆమె తల్లి నీతా అంబానీ వ్యక్తిగత ఆభరణాల సేకరణ కావడం విశేషం.స్టైల్స్‌లో ‘రాణింపు...జైపూర్ రాజ కుటుంబం కూడా మెట్ గాలా లో తనదైన శైలి రాజసం ఒలికించింది. రాజ వంశపు వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకువస్తూ, యువరాణి గౌరవి కుమారి తన అమ్మమ్మ నుంచి ప్రేరణ పొందిన దుస్తులతో మెట్‌గాలాలో అరంగేట్రం చేశారు. ప్రబల్ గురుంగ్ రూపొందించిన ఈ గౌనులో, మహారాణి గాయత్రీ దేవి అందించిన గులాబీ రంగు షిఫాన్ చీరను పొందుపరిచి, దానిని జైపూర్ నుంచి తెచ్చిన ముత్యాలు, కట్ చేయని వజ్రాలతో అలంకరించారు. ఈ లుక్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.అనన్య సామాన్యం...బిర్లాల కుటుంబానికి చెందిన భారతీయ మహిళా వ్యాపారవేత్త అనన్య బిర్లా కూడా తనదైన శైలిలో పూర్తి వైవిధ్యాన్ని ప్రదర్శించారు. డిజైనర్ రాబర్ట్ వన్ రూపొందించిన కస్టమైజ్డ్ దుస్తులను ధరించిన ఆమె, మెరిసే నల్లటి లోహంతో చేసిన స్కర్ట్‌పై బిగుతైన పెప్లమ్ జాకెట్‌ను ధరించారు. ప్రముఖ భారతీయ కళాకారుడు సుబోధ్ గు΄్తా రూపొందించిన వెండి ఫేస్ మాస్క్‌తో ఆమె సరికొత్త లుక్‌ను ప్రదర్శించారు. అతిరథ మహారథులైన హాలీవుడ్ నటీ నటులు, బాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ పాల్గొనే మెట్‌గాలాలో మన భారతీయ మహిళా వ్యాపారులు సైతం తమ సత్తా ప్రదర్శించడం... మహిళల్లోని మల్టీ టాస్కింగ్ స్కిల్స్‌కు చిరు ఉదాహరణ మాత్రమే... మొత్తం మీద మెట్‌గాలా వేడుకలో బిజినెస్ ఉమెన్ మెరుపులు అందరినీ అబ్బుర పరచాయి. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
మెట్ గాలాలో రూ. 142 కోట్ల నెక్లెస్‌తో మెరిసిన సుధా రెడ్డి..!
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో మెట్‌గాలా 2026 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో సెలబ్రెటీలు, ప్రముఖులు, ఇతరులు తమదైన శైలితో కళాత్మకంగా మెరిశారు. ఈసారి మన హైదరాబాద్ బిలియనీర్, MEIL(Megha Engineering and Infrastructures Limited) గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన సుధారెడ్డి అద్భుతమైన లుక్‌లో అలరించారు. ఈ వేడుకలో ఆమె మనీష్ మల్హోత్రా దుస్తులను ఎంచుకున్నారు. ఆమె ఈ ఈవెంట్లో 'కాస్ట్యూమ్ ఆర్ట్' అనే థీమ్‌కు అనుగుణంగా ధరించిన మిలియన్ డాలర్ల నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ నెక్లెస్ ఆమె వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్లలో ఒకటి. దీని ఖరీదు వచ్చేసి దాదాపు 142 కోట్లు పైనే పలుకుతుందట. ఈ ఆభరణం త్రిభుజాకార రోజ్-కట్ వజ్రాలతో కూడిన విక్టోరియన్-ఫినిష్ చైన్‌తో రూపొందించారు. పూల గుత్తులలో పొదిగిన ఈ రత్నాలు, నెక్లెస్ మధ్యలో ఉన్న 550 క్యారెట్ల ముదురు ఊదా-నీలం రంగు టాంజనైట్ ఈ నెక్లెస్ అందాన్ని మరింత హైలెట్ చేశాయి. ఈ నెక్లెస్‌ని 'క్వీన్ ఆఫ్ మెరెలానీ' అని పిలుస్తారట. ఈ ఆభరణంతోపాటు 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ వజ్రపు ఉంగరం, 40 క్యారెట్ల అస్చెర్-కట్ కొలంబియన్ పచ్చ ఉంగరంతో సుధారెడ్డి తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. ఇక మనీస్ మల్హోత్రా డిజైన్ చేసినా ఆమె డ్రెస్ 'జీవ వృక్షం', కాలం, జ్ఞాపకం, నిరంతర ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. ఇందులోని ప్రతిదారం చరిత్రలో ఒక భాగాన్ని వివరించే అద్భుతమైన కళ. అన్నింటకంటే ఆ డిజైనర్‌వేర్‌లో ఏకంగా మూడువేల ఏళ్ల వస్త్ర సంప్రదాయాన్ని అల్లికలు, ఎంబ్రాయిడరీ ద్వారా చూపించినట్లు పేర్కొన్నారు మల్హోత్రా. అందులో పాలపిట్ట, జమ్మి చెట్టు, కల్పవృక్ష, టాంగేడు, సూర్య, చంద్ర తదితర మూలాంశాలన్నీ ఈ డ్రెస్‌ను మరింత అందంగా కనిపించేలా చేశాయి. కాగా సుధారెడ్డి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన మెట్ గాలా లుక్ గురించి ఇలా షేర్ చేసుకున్నారు. "హైదరాబాద్ కేవలం తన పుట్టినిల్లు మాత్రమే కాదు, అది తనలో భాగమైన జీవన విధానం. తాను ఈ వేడుకలో ప్రపంచ వేదికపై దక్షిణ భారతీయతను కళ్లకు కట్టినట్లు చూపించేలా..అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు". కాగా, సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official)(చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్ : ఫ్యాషన్ వరల్డ్ షాక్!
ప్రముఖ వ్యాపారవేత్త వారసురాలు, గాయని, స్వయంగా వ్యాపారవేత్త అనన్య బిర్లా తన తొలి మెట్ గాలా 2026 ఈవెంట్ అరంగేట్రంలో ఫ్యాషన్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ డ్రెస్‌తో అదర గొట్టేశారు. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, సరికొత్త అర్థాన్నివ్వడం విశేషంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు మరింత వైరల్‌గా మారాయి. రెడ్ కార్పెట్ అనగానే సాధారణంగా సిల్క్ , వెల్వెట్ గౌన్లతో నిండి ఉంటాయి. కానీ అనన్య బిర్లా మెట్ గాలా 2026లో ఈ ట్రెండ్‌ను మార్చేశారు. ఏకంగా స్టెయిన్లెస్ స్టీల్‌తో చేసిన గౌను ధరించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అందుకే ఆ డ్రెస్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదని, అది ఒక శక్తివంతమైన భావప్రకటనా రూపమని ఆమె లుక్ నిరూపించింది.స్టెయిన్లెస్ స్టీల్ డ్రెస్ ప్రత్యేకతఅనన్య ధరించిన ‘ధరించగలిగే శిల్పం’ (Wearable Sculpture) ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచింది. దీనికి స్టెయిన్లెస్ స్టీల్‌ను ఉపయోగించి 'క్రోమ్ ఫినిషింగ్' తో తయారు చేశారు. దీంతో ఆమె ఒక ఆధునిక దేవతలా లేదా శక్తివంతమైన యోధురాలిలా మెరిసిపోయారు.ఈ డ్రెస్ భుజాల భాగం ఎంతో ధీమాగా, ఆర్కిటెక్చరల్ శైలిలో రూపొందించబడింది. ఇది ఆమె వ్యక్తిత్వంలోని బలాన్ని ప్రదర్శిస్తోంది.ఈ మెటల్ డ్రెస్ ఒక 'కవచం' (Armor) లాగా కనిపిస్తూ.. ఒక వ్యక్తి తన అస్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం నుండి ఎలా కాపాడుకుంటారో తెలియజేస్తుంది. View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)ఈ డ్రెస్ డిజైనర్లుబాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ రియా కపూర్ (Rhea Kapoor) దార్శనికతతోనే ఈ అవుట్‌ఫిట్ ఇంత పవర్‌ఫుల్‌గా తయారైందట. అంతర్జాతీయంగా పేరు గాంచిన ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రాబర్ట్ వున్ (Robert Wun), నిత్యావసర వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టించే భారతీయ సమకాలీన కళాకారుడు సుబోధ్ గుప్తా (Subodh Gupta) సమన్వయంతో దీన్ని రూపొందించారు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)అనన్య బిర్లా గురించి క్లుప్తంగాఅనన్య బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె. అనన్య ఆర్సిబి ఫ్రాంచైజీ కొత్త యజమాని ఆర్యమాన్ బిర్లా సోదరి కూడా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్, మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశారు. 17 ఏళ్ల వయసులో 'స్వతంత్ర'ను స్థాపించి, గ్రామీణ మహిళలకు అండగా నిలుస్తున్నారు. బిర్లా గ్రూప్ కంపెనీల బోర్డులలో కూడా ఉన్నారు. 'లివిన్ ది లైఫ్', 'మీంట్ టు బి' వంటి ప్రసిద్ధ ఆల్బమ్‌లతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గాయని. మానసిక ఆరోగ్యంపై అవగాహన, ఆ సమస్యలతో బాధపడుతోన్న వారికి నిపుణులచే కౌన్సెలింగ్ ఇప్పించే లక్ష్యంతో అమ్మతో కలిసి ‘Mpower’ అనే సంస్థ ని స్థాపించి సేవలందిస్తున్నారు. ఇటీవల ‘బిర్లా స్టూడియోస్’ పేరుతో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వేదికగా యువ ప్రతిభను ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటున్నారు.ఆమె నికర విలువసుమారు రూ.1,800 కోట్లు ఉంటుందని అంచనా. ఇదీ చదవండి: విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా? -
మెట్ గాలా-2026 ఈవెంట్లో సుధారెడ్డి (ఫొటోలు)
-
మెట్ గాలాలో గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్లో మొత్తం అమ్మ..
మెట్ గాలా 2026లో భారతీయ ఫ్యాషన్, కళలకు మద్దతు ఇవ్వాలనే తన వాదనను బలంగా వినిపించారు ఇషా అంబానీ. ఈ వేడుకలో ఆమె డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరలో చేతితో చిత్రించిన పిచ్వాయి ప్రేరేపిత నమునాలు ఉన్నాయి. కేవలం కళాకారుల కోసం మాత్రమే పనిచేసే రిలయన్స్ రిటైల్ బ్రాండ్ స్వదేశ్కు చెందని కళాకారులు ఈ చీరను స్వచ్ఛమైన బంగారు దారాలతో డిజైన్ చేశారు. ఆఖరికి బ్లౌజ్ కూడా స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే ఈ బ్లౌజ్ మొత్తం తన అమ్మ నీతా అంబానీ ఆభరణాలతో నిండి ఉందని వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది ఇషా. దాదాపు 1800 క్యారెట్ల వజ్రాల తోపాటు పచ్చలు, పోల్కీ, కుందన్లను ఈ వస్రం(బ్లౌజ్)లో పొదిగి దాని వారసత్వ రూపాన్ని సజీవంగా మార్చామని డిజైనర్ గౌరవ్ గుప్తా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇషా అద్భుతమైన చీర, ఆభరణాల తోపాటు క్రోచెట్ బ్యాగ్‌లో సుబోధ్ గుప్తా రూపొందించిన మామిడి శిల్పాన్ని కూడా రెడ్‌కార్పెట్‌పైకి తీసుకువచ్చారామె. ఇది భారతదేశ వారసత్వానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా చేతి కళకు నిదర్శనంగా నిలిచింది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఏడాది మెట్‌గాలా 2026 థీమ్ 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్'కు అనుగుణంగా ఉంది. అలాగే ఆమె తన జుట్టుని గజ్రా స్ఫూర్తితో రూపొందించిన కాగితం, రాగి ఇత్తడి కలయికతో రూపొందించిన ఆభరణంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిశారామె. దీన్ని బ్రూక్లిన్కు చెందిన సౌరబ్ గుప్తా అనే కళాకారుడు రూపొందించారు. ఈ వేడుకకు ముందు మే1 న్యూయార్క్ నగరంలో జరిగిన వేడుకలో భారతదేశాన్ని అక్షరాలా చిత్రించిన ఒక అద్భుతమైన బ్యాండేజ్ డ్రెస్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ డ్రెస్‌ని 26 రకాల అంచులతో రూపొందించడం విశేషం. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) (చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
#MetGala2026 : మెట్ గాలా 2026 ఈవెంట్లో ఇషా అంబానీ (ఫోటోలు)
-
ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..
MEIL గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన భారతీయ వ్యాపారవేత్త, హైదరాబాదీ సుధా రెడ్డి, న్యూయార్క్‌లో జరిగే మెట్ గాలా2026లో మెరవనున్నారు. ఆమె మెట్ గాలాలో ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఏడాది మెట్ గాలా సుమారు 400 ప్రత్యేకమైన కళాత్మక వస్తువులతో.. ఏకంగా ఐదువేల ఏళ్ల నాటి శైలిని చాటిచెప్పే 'కాస్ట్యూమ్ ఆర్ట్' ప్రదర్శనను ఇతివృత్తంగా "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" అనే డ్రెస్ కోడ్‌ను ఎంచుకుంది. ఈ మెట్‌గాలా కార్యక్రమంలో పాల్గొనే అతిరథమహులంతా తమ దుస్తులను సజీవ కళాఖండాలుగా కనిపించేలా మానవ శరీరం, కళాత్మక వ్యక్తీకరణ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని ప్రతిబింబించాలని ఆశిస్తోంది. గతంలో సుధా ప్రఖ్యాత భారతీయ డిజైనర్లు ఫల్గుణి షేన్ పీకాక్, తరుణ్ తాహిలియాని రూపొందించిన అద్భుతమైన దుస్తులను ధరించారు. ఈ ఏడాది ఫ్యాషన్‌ను ఒక కళారూపంగా పరిగణించే ఇతివృత్తం నేపథ్యంలో ఆమె సబ్యసాచి ముఖర్జీ లేదా మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖ భారతీయులతో కలిసి పనిచేయనున్నట్లు అంతరంగిక వర్గాల సమాచారం. పారిస్ ఒలింపిక్స్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వంటి అనేక ఉన్నత స్థాయి అంతర్జాతీయ కార్యక్రమాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బిజీగా ఉండే ఆమె ఈ ఏడాది న్యూయార్క్‌లో జరగనున్న గాలా ఈవెంట్ల్ భారత్‌కి ప్రాతినిథ్యం వహించనున్నారు.ఇక సుధా అందం, దాతృత్వ పరంగా ఆమెకు సాటిరారెవ్వరూ. ఆమె మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)లో డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే సుధా రెడ్డి ఫౌండేషన్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు, దీని ద్వారా ఆమె స్వచ్ఛంద ప్రాజెక్టులు, సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం వంటివి చేస్తుంటారు.ఆమె ఎవరంటే..సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆమె 2024 మెట్ గాలాలో 200 క్యారెట్లకు పైగా వజ్రాలు ధరించి వార్తల్లో నిలవడమే కాదు రెడ్ కార్పెట్‌పై తన ఉనికిని చాటిచెప్పేలా ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షించారు.ఆమె పుట్టి పెరిగింది విజయవాడలోనే. 19 ఏళ్లకే కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం తమ బంధానికి సహాయపడిందని, తామిద్దరూ కలిసే పెరిగామని రెడ్డి గతంలో చెప్పారు.2026, మే 4, సోమవారం నాడు జరగనున్న మెట్ గాలా, ఈ ఈవెంట్లో అత్యధిక తారలు పాల్గొనే కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది సహ-అధ్యక్షులుగా బియాన్స్, నికోల్ కిడ్మన్, వీనస్ విలియమ్స్ ఉండగా, జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ బెజోస్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక వేడుక,. ఇది కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం. దీనిని ప్రతి ఏడాది మే మొదటి సోమవారం నిర్వహిస్తారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official) (చదవండి: హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
ఇషా అంబానీ డైమండ్ నెక్లెస్ రూ. 1,267 కోట్లా? నెయిల్ ఆర్ట్ స్పెషల్ ఏంటి?
రిలయన్స్ సామ్రాజ్యానికి వారసురాలు, ఫ్యాషన్ ఐకాన్ బిడ్డ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ న్యూయార్క్ లో జరిగిన ప్రతిష్టాత్మక మెట్ గాలా 2025లో తళుక్కున మెరిసింది. ష్యాషన్, స్టైల్లో తన ప్రత్యేకతను చాటుకునే ఇషా మెగా ఈవెంట్లో తన ఫ్యాన్స్‌ను ఎక్కడా నిరాశపర్చలేదు. ఆమె ధరించిన దుస్తులు, నగలు, చివరికి ఆమె నెయిల్ పాలిష్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్, దాని ధర విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. పదండి మరి ఆ షాకింగ్ సంగతులేంటో తెలుసుకుందాం. డిజైనర్ అనామిక ఖన్నా రూ పొందించిన ఇషా డైమండ్ హారాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దాని ధర ఎంత, దాని మూలాలేంటి అనేది ఇంటర్నెట్ లో ఆసక్తిని రేకెత్తించింది.భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా ధరించిన హారం ధర రూ. 1,267 కోట్లు (150 మిలియన్ డార్లు) అని అంటున్నారు నెటిజన్లు.అంతేకాదు 2018 నాటి సెన్సేషన్ మూవీ ‘ఓషన్స్ 8’ లో దీన్ని ప్రదర్శించారని అంటున్నారు. ఈ సినిమాలో దొంగతనం కోసం అన్నే హాత్వే పాత్ర ధరించిన ఈ హారం. ఇది ఒకప్పుడు నవానగర్ మహారాజుకు చెందినది.కార్టియర్ డైమండ్ నెక్లెస్‌ను ఒకప్పుడు నవానగర్ మహారాజు ధరించారంటూ వ్యాఖ్యానించారు. ఇషా అంబానీ ఏమన్నారు?సోషల్ మీడియా వినియోగదారులు అది నిజంగా ఓషన్స్ 8 నెక్లెస్ అవునా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఇషా అంబానీ "ఇది మా అమ్మది" అని సింపుల్‌గా తేల్చి చెప్పేసింది. టిఫనీ ఉంగరాలు తప్ప, ఆ రాత్రి తాను ధరించిన దాదాపు ప్రతి నగ తన తల్లి నీతా అంబానీవేనని తెలిపింది. అయితే నవానగర్ మహారాజు ప్రేరణతో ఇషా అంబానీ తల్లి నీతా అంబానీ ఖరీదైన నెక్లెస్‌ను స్టేట్మెంట్ లేయర్డ్ పెర్ల్ , డైమండ్ నెక్లెస్‌తో మరింత స్టైల్ చేసింది. దీనిబరువు దాదాపు 136.25 క్యారెట్లు.ఇషా తన దుస్తులను 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్ ఆధారంగా స్టైల్ చేసింది. ఇక మేకప్, డిఫైన్డ్ ఐబ్రోస్, న్యూడ్-టోన్డ్ లిప్ స్టిక్ తో ఇషా తన లుక్ ని అందంగా తీర్చిదిద్దింది. దీంతోపాటు ప్రత్యేకమైన నెయిల్ ఆర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.బ్లాక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ఫ్యాన్సీ నెయిల్ ఎక్స్ టెన్షన్ ని ఎంచుకోవడానికి బదులుగా, ఇషా ట్విస్ట్ తో కూడిన షీక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ ని ఎంచుకుంది. తన క్రిస్పీ లుక్కు బ్లాక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్‌తో జతచేసింది. ఆమె నెయిల్స్ ని సెలబ్రిటీ మానిక్యూరిస్ట్ జూలియా స్టైల్ చేసింది. అప్రెస్ నెయిల్ రాసిన జెల్ కూలర్ ని ఉపయోగించినట్లు జూలియా వెల్లడించింది. ఆమె రెండు షేడ్స్ ని ఎంచుకుంది: ఒకటి 'ఫర్గాటెన్ ఫిల్మ్' అనే న్యూడ్ షేర్డ్, , మరొకటి 'ఫ్రెంచ్ బ్లాక్'. ప్రతి నెయిల్ లక్కర్ ధర 14.99 అమెరికా డాలర్లు. అంటే రూ. 1,252 రూపాయలు. రెండు షేడ్స్ కలిసి మొత్తం ఇషా అంబానీ నెయిల్ ఆర్ట్ ధర రూ. 2,504 లన్నమాట. -
చాలా భయపడ్డా.. పారిపోవాలనిపించింది: షారుక్ ఖాన్
సెలబ్రిటీల ఫ్యాషన్ షో ‘మెట్ గాలా’(Met Gala 2025) వేడుక వైభవంగా ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ వేదికగా ఈ ఫ్యాషన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘మెట్ గాలా’ డ్రెస్‌కోడ్ ‘టైలర్డ్ ఫర్ యు’ కాగా, ‘సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్స్టైల్’ను థీమ్‌గా నిర్ణయించారు నిర్వాహకులు. ఈ థీమ్‌కు తగ్గట్లుగా ఈ వేడుకలో నలుపు రంగు దుస్తుల్లో పాల్గొన్నారు ప్రముఖులు. ఇక ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్( Shah Rukh Khan) చరిత్ర సృష్టించారు. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్‌గా కనపడి, ఈ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు షారుక్ ఖాన్. ‘‘ఈ ఏడాది మెట్ గాలాకి ఆహ్వానం అందగానే నా కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఎంతగానో సంతోషించారు. ఈ వేడుకలో నేను పాల్గొంటే అది చరిత్ర అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు రెడ్ కార్పెట్‌పై నడవలేదు. నాకు ఫ్యాషన్‌పై ఆసక్తి కూడా తక్కువ. దీంతో ఈ వేడుకకు రావడానికి నేను చాలా భయపడ్డాను. కాస్త బిడియంగా అనిపించింది. ఓ దశలో పారిపోవాలనిపించింది’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. ఇంకా ఈ వేడుకలో నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా, ఆమె భర్త–నటుడు నిక్ జోనస్, హీరోయిన్ కియారా అద్వానీ, సింగర్–నటుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ ఈ వేడుకలో ‘బేబీ బంప్’తో మెరిశారు. -
మెట్‌గాలా 2025 ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)
-
Met Gala 2025: స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..
ప్రతిష్టాత్మకమైన మెట్‌గాలా 2025 ఈవెంట్లో బాలీవుడ్ తారలంతా తమదైన ఫ్యాషన్ శైలిలో మెరిశారు. వారందరిలో ఈ ఇద్దరే ఈవెంట్ అటెన్షన్ మొత్తం తమవైపుకు తిప్పుకున్నారు. ఈ మెట్‌గాలా ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి వాళ్లు ధరించిన డిజైనర్ వేర్లు. ఒకరు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రపంచ వేదికపై చూపించగా.. మరొకరు భారతీయ హస్తకళకు ఆధునికతను జోడించి హైరేంజ్ ఫ్యాషన్‌తో అలరించారు. ఆ ప్రమఖులు ఎవరు..? ఆ ఈవెంట్ ప్రత్యేకతే ఏంటి తదితరాల గురించి చూద్దామా..!.మెట్ గాలా ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్రముఖులు ఇషా అంబానీ(Isha Ambani), గాయని దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh)లు. ఇద్దరూ ఈవెంట్లో భారతీయ ఫ్యాషన్ కళ తమ భారతీయ సంప్రదాయ వారసత్వం, చేతికళలు గొప్పదనం తదితరాలే అర్థం పట్టేలా అట్రాక్టివ్ దుస్తుల్లో మెరిశారు. మొత్తం ఈవెంట్ వారి చుట్టూనే తిరుగుతుందేమో అనేంతగా ఉంది ఆ ఇరువురి లుక్. స్టైలిష్ డ్రెస్‌లో ఇషా..భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఇషా డిజైనర్ వేర్ని రూపొందించారు. టాప్ గోల్డ్ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్ కలర్ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్ తెల్లటి క్యాప్ లుక్‌లో అత్యంత స్టైలిష్ లుక్‌లో కనిపించింది ఇషా. అయితే డిజైనర్ అనామిక ఈ డ్రెస్‌కి అందమైన లుక్ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట. ఒక పక్క చేతితో చేసిన బెనరస్ ఫ్యాబ్రిక్‌పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్‌లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్ వేర్లా డిజైన్ చేశారామె. ప్రతి చిన్న కుట్టు మన సంప్రదాయ కళను సాంస్కృతికి అర్థం పట్టేలా శ్రద్ధ తీసుకుని మరీ డిజైన్ చేశారు. చూడటానికి బ్లాక్ డాండీ ఫ్యాషన్ లుక్లా అదిరిపోయింది. ఆ ఫ్యాషన్ వేర్కి తగ్గట్లు వింటేజ్ కార్టియర్ నెక్లెస్ ధరించారామె. నవానగర్ మహారాజుకు చెందిన ఈ నెక్లెస్ మొత్తం 480 క్యారెట్ల డైమెండ్ల తోపాటు షో-స్టాపింగ్ 80.73-క్యారెట్ కుషన్-కట్ డైమండ్ కూడా ఉంది. అలాగే చేతికి పక్షి ఉంగరాలు, నడుముకి వజ్రాలతో కూడిన ఆభరణం తదితరాలు ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) రాయల్ లుక్‌లో దిల్జిత్ దోసాంజ్గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలా 2025 నీలిరంగు కార్పెట్‌పై రాయల్ పంజాబీ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన వేదికపై సాంప్రదాయ సిక్కు వారసత్వాన్ని తెలియజేసేలా తలపాగా ధరించి వచ్చారు. సిక్కు రాయల్టీకి తగ్గ రాజదర్పంతో ఠీవీగా కనిపించారు దిల్జిత్ దోసాంజ్. భారతీయ రాజ వంశాలు ధరించే రత్నాలు, ముత్యాలు, పచ్చలు కూడిన ఆభరణాలు ధరించారు. సిక్కు శౌర్యం, గౌరవానికి ప్రతీక అయిన కత్తిని కూడా పట్టుకుని వచ్చారు. మెట్‌గాలాకి సంబంధించిన ఫ్యాషన్ వేర్ కాకపోయినా..గర్వంగా మా సంస్కృతే మా ఫ్యాషన్ అని చాటిచెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఇతర బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు కూడా తమదైన స్టైలిష్‌వేర్‌లో మెరిశారు. కాగా, ఈ ఏడాది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ ఛారిటీ ఈవెంట్ థీమ్ "సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్". అయితే ఈ 20 ఏళ్లలో పురుషుల దుస్తుల లుక్స్ పైకూడా దృష్టిసారించడం ఇదే మొదటిసారి. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..) -
#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)
-
మెట్ గాలాలో మెరిసిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. బేబీ బంప్‌తో ఎంట్రీ!
ప్రతిష్టాత్మక ఈవెంట్లో గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ మెరిసింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో జరిగిన మెట్‌గాలాలో బాలీవుడ్ సినీ తారలంత సందడి చేశారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. తన బేబీ బంప్‌తో వేదికపై ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తులను కియారా ధరించి ఈవెంట్లో మెరిసింది.కాగా..'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌తో మెట్ గాలా- 2025 ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బేబీ బంప్‌తో మెట్ గాలా కార్పెట్‌పై ఎంట్రీ ఇచ్చిన మొదటి భారతీయ నటిగా నిలిచింది. ఈ సందర్భంగా నా జీవితంలో ఒక నటిగా, కాబోయే తల్లిగా మెట్ గాలా అరంగేట్రం చేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందని కియారా పేర్కొంది. నా స్టైలిస్ట్ లుక్‌ను డిజైన్ చేయడానికి గౌరవ్ సృష్టించిన డ్రెస్ కోడ్ చాలా అందంగా ఉందని తెలిపింది.సినిమాల విషయానికొస్తే కియారా అద్వానీ చివరిసారిగా రామ్ చరణ్ సరసన కనిపించింది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో సక్సెస్ కాలేకపోయింది. కాగా.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ కొత్త ఏడాదిలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కియారా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. -
Met Gala 2025: ఆ ఐదు ఆహార పదార్థాలపై నిషేధం.. రీజన్ తెలిస్తే!
మెట్ గాలా (Met Gala) అంటే మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ (Costume Institute). ఇది అత్యంత ప్రసిద్ధమైన ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి. దీన్ని ప్రతి ఏడాది మే నెలలో న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహిస్తారు. దీన్ని కొత్త ఫ్యాషన్ ప్రదర్శనకు నిధులు సమకూర్చడం కోసం ప్రతి ఏటా నిర్వహిస్తారు. దీన్ని కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ వార్షిక ఫ్యాషన్ ప్రదర్శనకు సంబంధించిన వేడుకగా పేర్కొంటారు కూడా. ఈ కార్యక్రమానికి ఫ్యాషన్, సినీ, వ్యాపార, క్రీడల, రాజకీయ ప్రముఖులంతా విచ్చేస్తారు. ఈ ఏడాది మే5 సాయంత్రం ఆరు గంటలకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంజ్ వంటి భారతీయ తారలు అరంగేట్రం చేయనున్నారు. దీన్ని వోగ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అన్నా వింటౌర్ నిర్వహిస్తారు. ఇక ఈవెంట్లో అత్యంత ప్రసిద్ధి చెందింది పసందైన విందు మెనూ. ఈసారి ఈవెంట్లో ఎలాంటి వంటకాలు అందించనున్నారనేది వెల్లడి కాకపోయినా..ఆ ఫుడ్స్‌ని మాత్రం పూర్తిగా బ్యాన్ చేశారట. అవేంటి, ఎందుకని నిషేధించారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అన్నా వింటౌర్ నిర్వహించే ఈ వేడుకలో మెనూలో ఆ ఫుడ్స్‌ని ఆమె ఎందుకు నిషేధించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఏడాది మెట్ గాలా 2025(Met Gala 2025) డిన్నర్ నుంచి నిషేధించిన ఆహారాలు ఇవే..1. వెల్లుల్లి2. ఉల్లిపాయ3. చివ్స్4. పార్స్లీ5. బ్రూషెట్టాఎందుకు నిషేధించారంటే..ఈ ఐదింటిని ఎందుకు బ్యాన్ చేశారో లాస్ ఏంజిల్స్ గ్రేట్ టేస్ట్ క్యాటరింగ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ జాక్సన్ పరేడ్ వివరించారు. తాము అందించే ఆహారం సెలబ్రిటీల శ్వాసను, దంతాలను ప్రభావితం చేసేలా ఉండకూడదనే ఇలా ఆ ఐదు ఆహారాలకు చోటు ఇవ్వలేదట. అంతేగాదు ఆ ఐదు ఆహారాల వల్ల కలిగే అసౌకర్యం ఏంటో కూడా తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి అంటే అలెర్జీ ఉన్నవారు చాలామంది ఉన్నారట. అలాగే పార్సీ కచ్చితంగా దంతాల్లో ఇరుక్కుని ఇబ్బంది పెడుతుందట. అందుకని దాన్ని మెనూలోంచి తొలగించారు. బ్రూషెట్టా కూడా రాత్రిపూట ఇచ్చే విందులో అసౌకర్యంగా ఉంటుందట. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ఇబ్బందిలో పెట్టేస్తుందట. కాగా, ఈ ఏడాది మెట్‌గాలా కోసం ఫుడ్ మోనూని 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌తో అతిథులకు సర్వ్ చేయనున్నారు. దీన్ని అందించేది సెలబ్రిటీ చెఫ్ క్వామే ఒన్వుచి. ఈ అవకాశం తనకు లభించడం ఓ గౌరవమని అన్నారు ఒన్వుచి. న్యూయార్క్ సంస్థలో భాగం కావడం అనే తన ప్రోఫెషనల్ కల ఇన్నాళ్లకు నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఓఫ్యాషన్ ప్రేమికుడిగా 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌కి అనుగుణంగా వంటకాలు సిద్ధం చేసేలా చెఫ్ బృందంలో భాగం కావడం అనేది మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. (చదవండి: Water Fitness: నటుడు ధర్మేంద్ర వాటర్ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! మంచి గేమ్ ఛేంజర్..) -
Met Gala 2024 : అరంగేట్రంలోనే అదుర్స్..ఎవరీ మోనా (ఫొటోలు)
-
మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
-
మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!
న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్‌గాలా 2023లో తారలు సందడి గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తొలిసారి భర్త నిక్ జోనాస్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. మెట్‌గాలా 2023లో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ వాలెంటినో రూపొందించిన సెక్సీ బ్లాక్ గౌనులో చూపరులను కట్టి పడేసింది. ముఖ్యంగా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్‌ను ధరించింది. ఈ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 204 కోట్లు అని వార్త హల్చల్ చేస్తోంది. మరోవైపు ఈ ఈవెంట్ తర్వాత 25 మిలియన్ల బల్గేరియో ఫీషియల్ నెక్లెస్ వేలం వేయనున్నారు. (Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్) ప్రియాంక మూడోసారి ఈ ఈవెంట్లో తళుక్కు మనగా, తొలిసారిగా భర్తతలో కలిసి సందడి చేసింది. ఇద్దరూ బ్లాక్ అండ్‌వైట్ వాలెంటినో దుస్తుల్లో అలరించారు. ప్రియాంక ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన అమెరికన్ వెబ్ సిరీస్‌కు సిరీస్ సిటాడెల్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై అలియా భట్ అరంగేట్రంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అంతేకాదు రిలయన్స్అధినేత కుమార్తె ఇషా అంబానీ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇంకా ఫ్లోరెన్స్ పగ్, అన్నే హాత్వే, జారెడ్ లెటోరా కిమ్ కర్దాషియాన్, జెన్నిఫర్ లోపెజ్, నవోమి కాంప్‌బెల్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో ఒకటి 'మెట్ గాలా'. ఈ ఈవెంట్లో ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఫ్యాషన్ డిజైనర్ 2019లో మరణించిన ప్రసిద్ధ జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్. ఆయనకు ఈ ఈవెంట్ ఘన నివాళులర్పించింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) Her $25 million @Bulgariofficial necklace is going to be auctioned off after #MetGala @priyankachopra pic.twitter.com/LK0otVUHea — SAMBIT ⚡ (@GirlDontYell) May 2, 2023 -
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు)
మెట్ గాలా 2023: నిండైన శారీ గౌన్‌లో ఇషా అంబానీ.. దేవకన్యలా అలియా (ఫొటోలు -
నేనేం రోబోను కాదు.. మనిషినే!: ఎలన్ మస్క్
ఎలన్ మస్క్.. ఈ వ్యక్తి మీద రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కొంతమంది ఈయన్ని తిక్కలోడుగా భావిస్తుంటే.. ఎక్కువ మంది మాత్రం ఆయన్నొక మేధావిగా భావిస్తుంటారు. అయితే యువతకు మాత్రం ఆయనొక ఫేవరెట్ ఐకాన్. ఎవరేమీ అనుకున్నా.. తాను చేసేది తాను చేసుకుంటూ పోవడం ఆయన నైజం. ఈ క్రమంలో ఆయన వ్యక్తిత్వం మీద పలువురికి అనుమానాలు కలగవచ్చు. అయితే అందరిలా తనకూ భావోద్వేగాలు ఉంటాయని అంటున్నారు ఎలన్ మస్క్. ట్విటర్‌ను సొంతం చేసుకున్నాక తొలిసారి ఎలన్ మస్క్ జనం మధ్యకు వచ్చాడు. న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా వార్షికోత్సవానికి ఈ అపర కుబేరుడు తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చాడు. అయితే తనపై వచ్చే విమర్శలను భరించేంత గుణం తనలో లేదని వ్యాఖ్యానించాడాయన. మీడియా, ఇంటర్నెట్లో నా మీద వ్యతిరేకత విపరీతంగా కనిపిస్తుంటుంది. కానీ.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. నేనేం రోబోను కాను.. అందరిలా మనిషినే అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు ఆయన. ఆ టైంలో నాకూ బాధ అనిపిస్తుంటుంది. కానీ, వాటిని తేలికగా తీసుకునే ప్రయత్నం చేస్తానని, ప్రత్యేకించి ఆన్లైన్ ట్రోల్స్ విషయంలో అని ఆయన అన్నారు. అన్నట్లు.. ప్రపంచంలో అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్.. చాడ్విక్ బోస్మాన్ నివాళి ట్వీట్ కాగా, రెండో స్థానంలో నిలిచింది ఎలన్ మస్క్ ఈ మధ్య ‘కోకా-కోలా’ను కొనుగోలు చేస్తానని ప్రకటిస్తూ చేసిన ట్వీట్. చదవండి: ఆ పని చేస్తే నాకు నష్టం.. ఐనా పర్లేదు- ఎలన్ మస్క్ -
Met Gala: ఫల్గుణి, షేన్‌లు తీర్చిదిద్దిన గౌనులో మెరిసిన సుధారెడ్డి
వధువు కలలకు వర్ణాలు అద్దే డిజైన్లు ఎన్నెన్నో పలకరించినా మరో కొత్త ‘కళ’ కోసం కనులు వెతుకుతూనే ఉంటాయి. అబ్బురపరిచే రంగుల ఎంపిక.. ఔరా.. అనిపించే ఎంబ్రాయిడరీ పనితనం సంప్రదాయాన్ని చూపినా.. ఆధునికతను మేళవించినా మన దేశ సాంస్కృతిక ఘనతయే తమ డిజైన్లకు ప్రేరణ అనేది ఫల్గుణి షేన్ డిజైనర్ల మాట. ఈ జంట సృష్టించిన బ్రైడల్ కలెక్షన్ ఇది. కోటి కలలకు కొంగొత్త వర్ణాలు గత సోమవారం న్యూయార్క్ నగరంలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా 2021’ జరిగింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. ఈ ఏడాది థీమ్ ‘అమెరికన్ ఇండిపెండెట్స్కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుణి, షేన్‌లు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు. దీంతో భార్యాభర్తలైన ఫల్గుణి, షేన్ వార్తల్లో నిలిచారు. 15 సంవత్సరాలుగా డిజైనర్ రంగంలో ఉన్న ఈ జంట ముంబయ్ వేదికగా తమ డిజైన్లతో ప్రఖ్యాత వేదికల మీద ఆకట్టుకుంటున్నారు. తమ పేరుకు పీకాక్ జత చేసి ఫల్గుణి షేన్ పికాక్ పేరుతో తీసుకువచ్చిన దుస్తులకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా 2021’లో భారతీయ డిజైనర్లు ఫల్గుణి–షేన్ పీకాక్ డిజైన్ చేసిన డ్రెస్సులో మెరిసిన సుధారెడ్డి ఫల్గుణిషేన్ పీకాక్ డిజైన్లు ముఖ్యంగా వధూవరుల కలెక్షన్లో తమ ఘనతను చాటుతుండగా, రెడీ టు వేర్లో భాగంగా క్యాజువల్, స్పోర్ట్ , ఈవెనింగ్ పార్టీ వేర్లలోనూ తమ ప్రత్యేక డిజైన్ శైలిని చూపుతున్నారు. చదవండి: Health Tips In Telugu: బీట్రూట్, క్యారట్, గ్రీన్ టీ.. వీటిని తరచుగా తీసుకుంటే.. -
Met Gala 2021: మెట్ గాలాలో విభిన్న దుస్తులతో మెరిసిన తారలు
-
17ఏళ్ల తర్వాత.. ‘మాస్క్ ముద్దు’తో మళ్లీ కలిసిన ‘బెన్నీఫర్’
పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ మళ్లీ ఒకటై అభిమానులను సంతోషంలో ముంచెత్తారు. ఒకటైన తర్వాత వారిద్దరూ మాస్క్‌తోనే ముద్దు పెట్టుకున్నా పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెన్నిఫర్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2002లో నిశ్చితార్థం చేసుకుంది. నిజానికి 2003లో వివాహం చేసుకున్నారు. అయితే అది డిలే అయ్యింది. అనంతరం 2004లో విభేదాలతో విడిపోయారు. బ్రేకప్ తర్వాత జెన్నీ,మార్క్ ఆంటోనిని వివాహం చేసుకోగా.. ఆమె ప్రియుడు బెన్, జెన్నిఫర్ గార్నెర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ వారి లైఫ్ పార్టనర్స్ నుంచి విడాకులు తీసుకున్నారు. కాగా వీరిద్దరూ మళ్లీ ఒకటైన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ జెన్నీ తన 52 పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసి తన సంతోషాన్ని తెలిపింది. అయితే మళ్లీ కలిసిన వారిద్దరూ మొదటి సారి గత వారం వెనిస్ లిడోలో జరిగిన 78 వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై జంటగా నడిచారు. తాజగా సోమవారం (సెప్టెంబర్ 14న) మెట్ గాలా 2021లో రెడ్ కార్పెట్‌పై మరోసారి కనిపించిన ఈ జంట మాస్క్‌తోనే ముద్దు పెట్టుకొని అభిమానులకు కనులవిందు కలిగించారు. బెన్నీఫర్ ముద్దు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 17ఏళ్ల కలిసిన ఈ కపుల్‌ని చూసిన అభిమానులు ‘వావ్ అమేజింగ్’‘ఎప్పటికీ బెస్ట్ జోడి’ అంటూ కామెంట్ పెడుతున్నారు. "And then we kiss your our love comes alive on my lips"#MetGala2021 #Bennifer #BritneySpears pic.twitter.com/SfV2qngBj7 — I'm Still... (@BraveOnthe6) September 14, 2021 Living for #bennifer pic.twitter.com/s3HLurWllq — Momo (@MomoCominThru) September 14, 2021 -
మెట్ గాలా - 2019 హంగామా
-
అట్టహాసంగా ‘మెట్ గాలా 2019’
-
అట్టహాసంగా ‘మెట్ గాలా 2019’
-
అప్పుడు గెస్టులు.. ఇప్పుడు హోస్ట్‌లు
నిక్ జోనస్, ప్రియాంకాచోప్రాల పెళ్లి జరిగింది గత ఏడాది డిసెంబర్లో అయినప్పటికీ వారి చూపులు కలిసింది మాత్రం 2017 ‘మెట్‌గాలా ఈవెంట్’లో (న్యూయార్క్‌లో జరిగే ఓ ష్యాషన్ షో). 2018 మెట్‌గాలా ఈవెంట్లో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్లో ప్రియాంకా చోప్రా బాగానే వార్తల్లో నిలిచారు. ఒక్క ఈ ఈవెంట్ గురించే అని కాదు.. సినిమాల పరంగా, వీరి పెళ్లి గురించి బాగానే చర్చించుకున్నారు సినీ ప్రియులు. ఇప్పుడు వీటిని ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే విశేషం లేకపోలేదు. ఇంతకుముందు మెట్‌గాలా ఈవెంట్స్‌కు గెస్టులుగా వెళ్లారు నిక్, ప్రియాంక. ఈ ఏడాది మేలో జరగనున్న మెట్‌గాలా ఈవెంట్ హోస్టింగ్ కమిటీలో ఇద్దరి పేర్లు ఉండటం విశేషం. ‘‘తొలిసారి మెట్‌గాలా ఈవెంట్లో రెడ్ కార్పైట్‌పై నడిచినప్పుడు నా భర్త నిక్ జోనస్‌ను కలుసుకున్నాను. అప్పుడు నా జీవితంలోకి కొత్త మిత్రులు వచ్చారు. మెట్‌గాలా ఈవెంట్‌కి సంబంధించి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ బెనిఫిట్ కమిటీలో నిక్‌తో పాటు నా పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. గౌరవంగా భావిస్తున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు. ‘మెట్‌గాలా బెనిఫిట్ కమిటీ’లో పేరు దక్కించుకున్న తొలి భారతీయ వనిత ప్రియాంకా చోప్రాయేనట. ఈ కమిటీలో బ్రాడ్లీ కూపర్, జెన్నీఫర్ లోపెజ్, అలెక్స్ రోడ్రిగజ్లతోపాటు మరికొందరు ఉన్నారు. -
మెట్ గాలా: అదరగొట్టిన ప్రియాంక
న్యూయార్క్: న్యూయార్క్‌లో జరిగిన మెట్‌గాలా ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ బ్యూటీలు సందడి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు ఎలిగెంట్ దుస్తుల్లో బంగారు ఆభరణాల్లో రెడ్ కార్పెట్ పై మెరిసిపోయారు. సోమవారం జరిగిన ఈ మెగా ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీలు ప్రియాంకచోప్రా, దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడటంలో ఆశ్చర్యం ఏముంది. ఇపుడు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ ప్రతి ఏటా ‘మెట్ గాలా’పేరుతో ఈవెంట్ నిర్వహించడం ఆనవాయితీ. ఈవెంట్ ద్వారా వచ్చే విరాళాలను ఛారిటీలకు వినియోగిస్తారు. ఈ సంవత్సరం - "హెవెన్లీ బాడీస్: ఫ్యాషన్ అండ్ కాథలిక్ ఇమాజినేషన్’’ థీమ్‌తో నిర్వహించారు. హర్పెర్స్ బజార్ అత్యుత్తమ దుస్తుల జాబితాలో టాప్‌లో నిలవగా, ప్రియాంకా చోప్రా 17స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి కూడా దీపికి పదుకోన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హాలీవుడ్లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రియాంకచోప్రా, బాలీవుడ్స్టార్ హీరోయిన్ దీపికాను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
సెన్సేషన్: బాత్రూమ్లో సెలబ్రిటీల సెల్ఫీ..
వాషింగ్టన్: పలు దేశాలకు చెందిన సినీ సెలబ్రిటీలు మెట్ గాలా ఫ్యాషన్ షోలో విభిన్న ఆహార్యంతో అదరగొట్టినా ప్రస్తుతం ఓ సెల్ఫీ వైరల్‌గా మారింది. అమెరికాలోని న్యూజెర్సీలో 69వ వార్షిక మెట్ గాలా ఫ్యాషన్ షో అట్టహాసంగా నిర్వహించారు. ఆ షో లో సోషల్ మీడియా స్టార్ కైలీ జెన్నర్ తీసిన ఓ సెల్ఫీ వివాదాస్పదంగా మారింది. మెట్ గాలా వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా దాదాపు 20 మంది సెలబ్రిటీలు ఓ బాత్రూమ్లోకి వెళ్లగా.. కైలీ తన కెమెరాకు పనిపెబుతూ సెల్ఫీ తీసింది. షో నిర్వాహకులు సెల్ఫీలో ఉన్న సెలబ్రిటీలపై మండిపడుతున్నారు. మెట్ గాల్ రూల్స్ ప్రకారం సాధారణంగానే సెల్ఫీలు దిగడం నిబంధనలకు విరుద్దం. కానీ కెండల్ జెన్నర్, కిమ్ కర్దాషియన్ , లిలీ అల్డ్రిడ్జ్, రాకీ, పబ్ డాడీ, బ్రీ లార్సన్, పారిస్ జాక్సన్, తదితరులు బాత్రూమ్లో గుమిగూడగా కైలీ జెన్నర్ సెల్ఫీ తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలో 20 లక్షల మంది లైక్ చేయగా, 5.1లక్షల మంది ఈ ఫొటోపై కామెంట్ చేయడం విశేషం. ఈ ఫ్యాషన్ ఈవెంట్లో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రాలు పాల్గొని సందడి చేశారు.


