మళ్లీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిన జెన్నీఫర్‌ లోపెజ్‌, బెన్ అఫ్లెక్

Jennifer Lopez and Ben Affleck kiss at Met Gala - Sakshi

పాప్‌ సింగర్‌ జెన్నిఫర్‌ లోపెజ్‌, హాలీవుడ్‌ నటుడు బెన్ అఫ్లెక్ మళ్లీ ఒకటై అభిమానులను సంతోషంలో ముంచెత్తారు. ఒకటైన తర్వాత వారిద్దరూ మాస్క్‌తోనే ముద్దు పెట్టుకున్నా పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

బెన్నిఫర్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2002లో నిశ్చితార్థం చేసుకుంది. నిజానికి 2003లో వివాహం చేసుకున్నారు. అయితే అది డిలే అయ్యింది. అనంతరం 2004లో విభేదాలతో విడిపోయారు. బ్రేకప్‌ తర్వాత జెన్నీ,మార్క్‌ ఆంటోనిని వివాహం చేసుకోగా.. ఆమె ప్రియుడు బెన్‌, జెన్నిఫర్‌ గార్నెర్‌ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ వారి లైఫ్‌ పార్టనర్స్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. కాగా వీరిద్దరూ మళ్లీ ఒకటైన విషయాన్ని కన్‌ఫర్మ్‌ చేస్తూ జెన్నీ తన 52 పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో ఫోటోలను పోస్ట్‌ చేసి తన సంతోషాన్ని తెలిపింది. 

అయితే మళ్లీ కలిసిన వారిద్దరూ మొదటి సారి గత వారం వెనిస్ లిడోలో జరిగిన 78 వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్‌పై జంటగా నడిచారు. తాజగా సోమవారం (సెప్టెంబర్‌ 14న) మెట్ గాలా 2021లో రెడ్‌ కార్పెట్‌పై మరోసారి కనిపించిన ఈ జంట మాస్క్‌తోనే ముద్దు పెట్టుకొని అభిమానులకు కనులవిందు కలిగించారు. బెన్నీఫర్‌ ముద్దు ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 17ఏళ్ల కలిసిన ఈ కపుల్‌ని చూసిన అభిమానులు ‘వావ్‌ అమేజింగ్‌’‘ఎప్పటికీ బెస్ట్‌ జోడి’ అంటూ కామెంట్‌ పెడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top