తన పిల్లల ముందే నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Ben Affleck- Jennifer Lopez: పెళ్లిమండపంలో తల్లికి గాయాలు, అయినా హీరో రెండో పెళ్లి!

Published Sun, Aug 21 2022 4:02 PM

Ben Affleck, Jennifer Lopez Get Married Again For Second Time - Sakshi

హాలీవుడ్‌ స్టార్స్‌ జెన్నిఫర్‌ లోపెజ్‌, బెన్‌ అఫ్లెక్‌ పెళ్లి చేసుకున్నారు. అదేంటి, మళ్లీ పెళ్లేంటి? అనుకుంటున్నారా? అవును, జూలైలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఈ దంపతులు తాజాగా అందరి సమక్షంలో మరోసారి ఉంగరాలు మార్చుకున్నారు. శనివారం జార్జియాలోని బెన్‌ నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరగడానికి ఒకరోజు ముందు అతడి తల్లి క్రిస్‌ యానే ఇంట్లో కిందపడింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేరించగా వైద్యులు చికిత్స చేసిన అనంతరం తనను వీల్‌చైర్‌లో డిశ్చార్జ్‌ చేశారు. అదే స్థితిలో పెళ్లికి హాజరైన ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించింది.

కాగా 2001లో గిగ్లి సినిమా షూటింగ్‌ సెట్స్‌లో బెన్‌ అఫ్లెక్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌ మధ్య ప్రేమ పుట్టగా ఆ మరుసటి ఏడాదే నిశ్చితార్థం చేసుకున్నారు, కానీ పెళ్లి మాత్రం వాయిదా వేశారు. చివరికి 2004లో పెళ్లి చేసుకోవట్లేదని ప్రకటించారు. 2021లో వీరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించడంతో ఈసారి దాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇక ఈ వివాహానికి పలువురు సెలబ్రిటీలతో పాటు జెన్నిఫర్‌ లోపెజ్‌ మాజీ భర్త, వారి సంతానం, అలాగే బెన్‌ మాజీ భార్య, వారి పిల్లలు హాజరయ్యారు.

ఇకపోతే హీరో బెన్‌ అఫ్లెక్‌ మొదటి భార్య పేరు జెన్నిఫర్‌ గార్నర్‌. వీరికి వయొలెట్‌, సెరఫినా, సామ్యూల్‌.. అని ముగ్గురు పిల్లలు సంతానం. 2018లో గార్నర్‌తో తెగదెంపులు చేసుకున్న బెన్‌ తర్వాత లిండ్సే షూకస్‌, అనడే ఆర్మస్‌లతో డేటింగ్‌ చేశాడు. గాయని, నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ విషయానికి వస్తే ఈమె గతంలో ఓజానీ నోవాను 1997లో వివాహం చేసుకోగా 1998 ప్రారంభంలో విడిపోయారు. 2001లో క్రిస్‌ జుడ్‌ని పెళ్లి చేసుకుని 2002లో విడిపోతున్నట్లు ప్రకటించింది. 2004లో సింగర్‌ మార్క్‌ ఆంటోనీని పెళ్లాడింది. వీరికి 2008లో ఎమ్మీ, మాక్స్‌ అని కవలలు పుట్టారు. ఆ తర్వాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.

చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్‌, షాక్‌లో ఫ్యాన్స్‌
హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్‌, కార్లిటీ ఇచ్చిన యంగ్‌ హీరో

Advertisement
 
Advertisement
 
Advertisement