Gautham Karthik: హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్‌, కార్లిటీ ఇచ్చిన యంగ్‌ హీరో

Gautham Karthik Open Up On His Marriage Rumours With Manjima Mohan - Sakshi

కోలీవుడ్‌లో నవరస నాయకుడు ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కార్తీక్‌. ఈయన వారసుడే గౌతమ్‌ కార్తీక్‌. తనూ హీరోగా మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. అదే సమయంలో ఇటీవల ఈయన ప్రేమ వ్యవహారంపై వదంతులు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. నటి మంజిమా మోహన్‌తో ప్రేమ అంటూ త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం జోరందుకుంది. గౌతమ్‌ కార్తీక్‌ నటి మంజిమా మోహన్‌ దేవరాట్టం చిత్రంలో జంటగా నటించారు. వీరిద్దరూ చట్టపటాలు వేసుకుని షికారు చేస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఈ విషయంపై ఇటు గౌతం కార్తీక్‌ గాని, అటు మంజిమా మోహన్‌ గాని స్పందించడంలేదు.

చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక

ఇలాంటి పరిస్థితుల్లో నటుడు గౌతమ్‌ కార్తీక్‌ ఒక భేటీలో తన వివాహం గురించి స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాదిలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు.  ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అయితే తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి గానీ, నటి మంజమా మోహన్‌ ప్రస్తావని గాని ఈయన ఎక్కడ తీసుకురాలేదు. తాను నటుడుగా సాధించాలని ఈ రంగంలోకి వచ్చానని, అయితే కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని అన్నారు. ఇకపై కథల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి చిత్రాలను చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వధువు ఎవరు అన్నది చెప్పకపోవడంతో ఆ వధువు ఎవరు చెప్పు నవరస నాయకుడి వారసుడా.. అంటూ నెట్టింట్లో అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  

చదవండి: తొలి రెమ్యునరేషన్‌ ఎంతో చెప్పిన ఆలియా..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top