అప్పుడు గెస్టులు.. ఇప్పుడు హోస్ట్‌లు

Priyanka Chopra, Nick Jonas part of 2019 Met Gala Host Committee - Sakshi

నిక్‌ జోనస్, ప్రియాంకాచోప్రాల పెళ్లి జరిగింది గత ఏడాది డిసెంబర్‌లో అయినప్పటికీ వారి చూపులు కలిసింది మాత్రం 2017 ‘మెట్‌గాలా ఈవెంట్‌’లో (న్యూయార్క్‌లో జరిగే ఓ ష్యాషన్‌ షో). 2018 మెట్‌గాలా ఈవెంట్‌లో డిఫరెంట్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌లో ప్రియాంకా చోప్రా బాగానే వార్తల్లో నిలిచారు. ఒక్క ఈ ఈవెంట్‌ గురించే అని కాదు.. సినిమాల పరంగా, వీరి పెళ్లి గురించి బాగానే చర్చించుకున్నారు సినీ ప్రియులు. ఇప్పుడు వీటిని ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే విశేషం లేకపోలేదు. ఇంతకుముందు మెట్‌గాలా ఈవెంట్స్‌కు గెస్టులుగా వెళ్లారు నిక్, ప్రియాంక.

ఈ ఏడాది మేలో జరగనున్న మెట్‌గాలా ఈవెంట్‌ హోస్టింగ్‌ కమిటీలో ఇద్దరి పేర్లు ఉండటం విశేషం. ‘‘తొలిసారి మెట్‌గాలా ఈవెంట్‌లో రెడ్‌ కార్పైట్‌పై నడిచినప్పుడు నా భర్త నిక్‌ జోనస్‌ను కలుసుకున్నాను. అప్పుడు నా జీవితంలోకి కొత్త మిత్రులు వచ్చారు. మెట్‌గాలా ఈవెంట్‌కి సంబంధించి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈవెంట్‌ బెనిఫిట్‌ కమిటీలో నిక్‌తో పాటు నా పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. గౌరవంగా భావిస్తున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు. ‘మెట్‌గాలా బెనిఫిట్‌ కమిటీ’లో పేరు దక్కించుకున్న తొలి భారతీయ వనిత ప్రియాంకా చోప్రాయేనట. ఈ కమిటీలో బ్రాడ్లీ కూపర్, జెన్నీఫర్‌ లోపెజ్, అలెక్స్‌ రోడ్రిగజ్‌లతోపాటు మరికొందరు ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top