వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేత, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా అన్నారు. శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ సుపరిపాలనను ఓర్వలేకే చంద్రబాబునాయుడు పెయిడ్ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.