రాహుల్... పగ్గాలు అందుకోండి! | Take the Reins Rahul gandhi | Sakshi
Sakshi News home page

Nov 8 2016 7:20 AM | Updated on Mar 22 2024 11:13 AM

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పే తరుణం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. సోమవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో.. ‘పార్టీ అధ్యక్షుడిగా మీరే ఉండాలి’ అంటూ సభ్యులు ముక్తకంఠంతో రాహుల్‌ను కోరారు. 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ సారథ్యానికి ఆయనే అన్ని విధాలా అర్హుడని తేల్చిచెప్పారు. పార్టీలో నిర్ణయాధికారం కలిగిన సీడబ్ల్యూసీలో దీనిపై చర్చ జరగడం తొలిసారి. సీనియర్ నేత ఏకే ఆంటోనీ తొలుత ఈ అంశాన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని మన్మోమోహన్‌సింగ్‌తో పాటు సీనియర్ నేతలందరూ ఏకగ్రీవంగా సమర్థించారు. ‘రాహుల్ పార్టీ అధ్యక్ష స్థానాన్ని అలంకరించాలని కోరుకుంటున్న కోట్లాది మంది కార్యకర్తల అభీష్టాన్ని సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement