బీఎంసీలో బీజేపీ ‘మహా’ విజయం | BJP cuts tiger's tail, wins 8 of 10 Maharashtra corporations | Sakshi
Sakshi News home page

Feb 24 2017 6:58 AM | Updated on Mar 22 2024 11:30 AM

మహారాష్ట్రలో జరిగిన 10 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. కీలకమైన ముంబై మునిసిపాలిటీలో గణనీయంగా సీట్లు పెంచుకుంది. 25 ఏళ్లుగా శివసేనతో పొత్తు ఆధారంగా స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చిన బీజేపీ ఈసారి ఒంటరిగానే (అక్కడక్కడ చిన్న పార్టీలను కలుపుకుని) పోటీచేసి ఘనమైన ఫలితాలు సాధిం చింది. బృహన్‌ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా సీట్ల సంఖ్యను పెంచుకుంది. శివసేన కంచుకోటగా ఉన్న బీఎంసీలో మొత్తం 227 స్థానాలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement