పాత కక్షలతో ముగ్గురిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పాత కక్షలతో ముగ్గురిపై హత్యాయత్నం

Nov 6 2026 2:44 AM | Updated on Nov 6 2026 2:44 AM

మదనపల్లె టౌన్‌: పాత కక్షల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై ప్రత్యర్థులు కరల్రు, రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం మొలకలచెరువు మండలంలో జరిగింది. బాదితుల కథనం మేరకు... మొలకలచెరువు మండలం, సోంపల్లి పంచాయతీ, ఏడుమడకలపల్లెకు చెందిన రామాంజులు, అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌ బంధువులు. వీరి మధ్య గతంలో పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రమాదేవి ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి నీళ్లు వృథాగా పోతుండటాన్ని గమనించిన రామాంజులు గురువారం కుళాయిని ఆఫ్‌ చేశాడు. దీంతో రమాదేవి శ్రీమా ఇంటి కుళాయితో నీకేంటి పన్ఙి అని ఘర్షణ పడింది. ఇదే అదునుగా భావించిన రమాదేవి కుటుంబ సభ్యులు ప్రభాకర్‌, కృష్ణప్పలు రామాంజులు, నాగరత్నమ్మ దంపతులపై కరల్రు, రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన రామాంజులు కుమారుడు రాఘవేంద్రపై కూడా దాడి చేశారు. స్థానికులు గాయపడిన వారిని 108లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాఘవేంద్ర కన్నుకు తీవ్రంగా దెబ్బ తగిలింది. బాధితుల ఫిర్యాదు మేరకు మొలకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement