చెట్టును ఢీకొన్న బైక్‌: యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బైక్‌: యువకుడు దుర్మరణం

Nov 6 2026 2:44 AM | Updated on Nov 6 2026 2:44 AM

ఖాజీపేట: మండల కేంద్రమైన ఖాజీపేట బైపాస్‌ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెమ్ముళ్ళపల్లె గ్రామానికి చెందిన ములపాక హరికృష్ణ (20) అనే యువకుడు శ్రీసెవెన్‌ క్యాష్‌శ్రీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగా హరికృష్ణ తన మిత్రులైన అజీజ్‌, అబ్దుల్లాలతో కలిసి ద్విచక్ర వాహనంలో ఖాజీపేట బైపాస్‌ రోడ్డు గుండా వెళ్తున్నాడు. వాహనం ఖాజీపేట సమీపంలోని జాబిలి డాబా వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో హరికృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అజీజ్‌, అబ్దుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హరికృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌ మార్చురీకి తరలించారు.

కుక్క అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి..

కొండాపురం: కుక్క అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ మంజునాథ్‌ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి నాగశంకర్‌రెడ్డి (50) తన భార్యతో కలిసి గురువారం ద్విచక్రవాహనంలో తాడిపత్రిలోని దత్త వైద్యశాలకు బయలుదేరారు. దారిమధ్యలో దత్తాపురం గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఓ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో నాగశంకర్‌రెడ్డికి తీవ్రంగా, ఆయన భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే తాడిపత్రి ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగశంకర్‌రెడ్డి మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement