కడప అర్బన్: కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా వివాదాలను ఇరుపక్షాల అంగీకారంతో సత్వరంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి శ్రీమధ్యవర్తిత్వంశ్రీ ఉత్తమమైన మార్గమని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్.హరిబాబు పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.రామగోపాల్, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ సూచనల ప్రకారం కడప నగరంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. గురువారం ప్రకాష్ నగర్ కాలనీ, శివాలయం వీధిలోని రెండు ప్రాంతాలలో ప్రజలకు న్యాయ సేవలు, మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్‌లపై చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్.హరిబాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుతున్న వివిధ సేవలు, పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. రాబోయే డిసెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, రాజీకి అవకాశం ఉన్న ముందస్తు వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. అర్హులైన పేదలు, మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు చట్టప్రకారం ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చని వివరించారు. న్యాయ సేవల కోసం 15100 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రజలు తమ న్యాయపరమైన హక్కులను తెలుసుకొని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
అప్రజాస్వామ్య రీతిలో పోలింగ్
రాజంపేట : మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ అప్రజాస్వామ్యకంగా జరిగిందని నందలూరు మాజీ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఎంపీ మేడా రఘునాథరెడ్డి స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. మండలంలోని ఎర్రచెరువుపల్లె 1వ పోలింగ్‌బూత్‌లో పోలింగ్ ప్రారంభం కాక ముందే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లేకుండా చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలే కానీ, దౌర్జన్యంగా లాక్కోవడం అంటే అంత ఘోరమైన అంశంగా ప్రజలు పరిగణిస్తున్నారన్నారు. ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పోస్టులాగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం విష సంస్కృతిని తీసుకొచ్చిందని, దీని పర్యావసానాలు భవిష్యత్తులో వారే ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. కూటమిలో కుమ్మలాట జరిగి, చివరికి టీడీపీ ఏజెంట్ల ఫారాలను జనసేన వర్గీయులు తీసుకోవడం, జనసేన వారిని టీడీపీ అడ్డుకోవడం జరుగుతోందన్నారు. వీరి పరిస్థితిని ఓటర్లు కూడా విస్మయానికి గురవుతున్నానన్నారు. సజావుగా ఓట్లు వేయించుకొని, ఆ తర్వాత వచ్చే తీర్పును అనుసరించాలన్నారు. మేడా మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనరు సిద్ధవర గోపిరెడ్డి, ఐటీ సాప్ట్‌వేర్ మేడా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.


