కూటమి చేసింది ఏమీలేక..
సాక్షి ప్రతినిధి, కడప: కడప వైఎస్సార్‌సీపీకి కంచుకోట అని మరోసారి రుజువైంది. కడప కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని టీడీపీ గెలిచిందనే దానికంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి దీప్తిరెడ్డికి 66,027ఓట్లు లభించడమే జిల్లాలో పెద్దగా చర్చనీయాంశమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూటమి నేతలు సాగించిన అరాచకం నభూతో నభవిష్యతి అన్న విధంగా తయారైంది. దీనికితోడు అధికార యంత్రాంగం మొత్తం కూటమి ఎదుట సాగిలపడిన తీరు లోకమంతా చూసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల రోజు ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి వైఎస్సార్‌సీపికి మద్దతు పలకడం చర్చకు కారణమైంది. అర్ధరూపాయి డబ్బు పంపిణీ చేయకుండా ఆస్థాయి ఓట్లు సాధించడం ‘గొప్ప విషయమం’ అనే మాట విశ్లేషకుల నోట వినిపిస్తోంది.
● కడప కార్పొరేషన్ పరిధిలో 66డివిజన్లలో పోటీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధం కాగా వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని నామినేషన్ల దశలోనే టీడీపీ నరమేధం సాగించింది. పోలీసు అధికారుల సాక్షిగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై నడివీధుల్లో ప్రత్యక్షదాడికి తెగబడింది.
శాంతిభద్రతల పరిరక్షణకు రెండు కళ్లులాంటి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ నివాసాలున్న ప్రాంతాలల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడే ఎన్నికలపై ప్రజల్లో భయం కలిగింది. ఇలా ఉంటే ప్రజలు ఓటు ఎలా వేస్తారంటూ ప్రజాస్వామ్యవాదుల్లోనూ ఆందోళన మొదలైంది. అప్పటికే 52 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ఆపై సుప్రీం తీర్పుతో 11 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా నామినేషన్ వేశారు. అంతటితో ఆగలేదు..నామినేషన్ల పరిశీలన.. ఆపై ఉపసంహరణలో పచ్చ నేతలు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యంగా నిలబడ్డారు.
ముగ్గురూ ముగ్గురే.....
కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి బండిదీప్తిరెడ్డి, 33వ డివిజన్ కార్పోరేటర్ సంద్యారాణి(దేవిరెడ్డి ఆదిత్య), 46వ డివిజన్ కార్పోరేటర్ జమీల్ ముగ్గురు ముగ్గురే అన్నట్లుగా కీర్తి గడించారు. దీప్తిరెడ్డి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి అనర్గళంగా ప్రజలకు వివరించింది. టీడీపీ నేతల దౌర్జన్యానికి ధీటుగా జవాబు చెబుతూ ప్రజల ముంగిటకు వెళ్లింది. ఆమెకు అండగా జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, మాజీ మేయర్ సురేష్‌బాబు, కమలాపురం ఇన్‌ఛార్జి నరేన్ రామాంజులరెడ్డి ప్రచారపర్వం కొనసాగించారు. 33,46వ డివిజన్ల్లలో వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లు లేకపోయినా, వందలాది ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నా జమీల్ 344ఓట్లు, దేవిరెడ్డి ఆదిత్య సతీమణీ సంధ్యారాణి 139 ఓట్లుతో విజయం సాధించడాన్ని పలువురు కొనియాడుతున్నారు.
జిల్లా కేంద్రంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్పుకునే అవకాశం లేకే ఇలాంటి దాడులు.. దౌర్జన్యాలు తెరపైకి తీసుకొచ్చాని విశ్లేషకులు వివరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రత్యక్ష దాడులకు దిగడం.. తిరగబడితే ఏకపక్షంగా హత్యయత్నం కేసులు నమోదు చేయడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. బయట కన్పిస్తే అరెస్టు లు చేస్తారనే భయంతో వైఎస్సార్‌సీపీ నేతలు అజ్ఞాతవాసం గడపాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి దంపతులు వైఎస్సార్‌సీపీ నేతల్ని టార్గెట్ చేసినప్పటికీ ప్రజలు ఆశీర్వదించడం వారికి జీర్ణించుకోలేని అంశంగా పరిగణించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులల్లో టీడీపీ నేతలకు భవిష్యత్‌పై బెంగపట్టుకుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
మేయర్ అభ్యర్థి బండిదీప్తిరెడ్డికి
66,027 ఓట్లు
స్వచ్ఛందంగా మద్దతు పలికిన నగర ఓటర్లు
కౌంటింగ్ కేంద్రంలో
నివ్వెరపోయిన టీడీపీ శ్రేణులు
రిగ్గింగ్, సైక్లింగ్ లేకుంటే టీడీపీ అడ్రసు గల్లంతు
వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని
చేపట్టిన అరాచకమే కారణం
భవిష్యత్‌పై బెంగపెట్టుకున్న టీడీపీ నేతలు


