ప్రజల ఆదరణ అపూర్వం... | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆదరణ అపూర్వం...

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

ప్రజల ఆదరణ అపూర్వం...

పోలింగ్‌ తేదీ రానే వచ్చింది. తెల్లవారుజాము నుంచే పచ్చమూక కేంద్రాల చుట్టూ మోహరించింది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు రాకుండానే ఎక్కడికక్కడ దౌర్జన్యకాండ చేసింది. ఎదిరించిన వారిపై దాడులకు దిగింది. అంతకుముందు పోలీసు యంత్రాంగమూ తమ వంతు సాయంగా ముఖ్యనేతలందరినీ ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌ చేసి స్వామి భక్తిని ప్రదర్శించింది.ఇన్ని ఆటంకాల నడుమ పోలింగ్‌ ప్రారంభమైంది...

‘ఒకటో తేదీ వస్తే చాలు... తన మనవడు వైఎస్‌ జగన్‌ ఇంటికి పింఛన్‌ పంపించిన సాయం గుర్తొచ్చిన ‘అవ్వ’ ఓటరు స్లిప్‌తో అడుగేసింది... ‘తన బిడ్డల చదువులకు అన్నగా వైఎస్‌జగన్‌ అందించిన ‘అమ్మ ఒడిని’ తలచుకుని ఓ చెల్లి పోలింగ్‌ బూత్‌ వైపు నడిచింది.. ‘చేయూత’నిచ్చిన తమ్ముడు జగన్‌ మేలును గుర్తుంచుకుని ఓ అక్క ధైర్యంగా ఓటేయడానికి వచ్చింది.. జగనన్న ‘ఫ్యాన్‌’గా ఓ యువకుడు.. ‘ఆరోగ్య శ్రీ’ ఆసరా సాయం పొందిన ఓ మధ్య వయస్కుడు.. ఇలా ఒక్కొక్కరుగా ఆంక్షల సంకెళ్లను తెంచుకుంటూ అడుగేశారు. ‘ఒక్క రూపాయి డబ్బు ఇవ్వకుంటేనేమి సారూ.. ఆయన చేసిన సాయం మా గుండెల్లో నిలిచే ఉంది ’ అంటూ ఓటేశారు.. అంతే.. ఒక్కొక్కరుగా ఓటర్లు వస్తుండడంతో దిమ్మ తిరిగిన కూటమి నేతలు మధ్యాహ్నానికే ‘బరి’ తెగించారు. అప్పటివరకు విపక్ష ఏజెంట్లే లేరు..ఇక తమకు అడ్డెవరులే అనుకుంటే ఈ ఓటర్లు కొంప ముంచేలా ఉన్నారనుకుని.. ఓటర్లనూ అడ్డుకున్నారు. ఆపై విచ్చలవిడిగా రిగ్గింగ్‌.. సైక్లింగ్‌ చేసుకున్నారు. మధ్యాహ్నం ఓటేద్దామని వెళ్లిన వారి చేతిలోంచి ‘స్లిప్పు’ తీసుకుని ‘మీ ఓటు వేసేశాం ..మీరు వెళ్లిపోండి’ అంటూ దౌర్జన్యం చేశారు. అంతకుముందు స్వచ్ఛందంగా ప్రజలు వేసిన ఓట్లన్నీ వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బండిదీప్తిరెడ్డికే లభించాయి. పోలింగ్‌కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకున్నా.. పోలీసుల సమక్షంలో పచ్చమూకలు దాడులు చేస్తున్నా 66,027 ఓట్లు రావడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రశాంత ఎన్నికలు తెరపైకి వచ్చింటే ‘ఫ్యాను గాలికి’ టీడీపీ కొట్టుకుపోయేవారని స్పష్టం చేస్తున్నారు.

నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ దాకా పచ్చమూక సాగించిన దౌర్జన్య పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement