– ఎమ్మెల్యే ఆకేపాటి
రాజంపేట: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వంలో భాగంగా తొలిరోజు వైఎస్సార్సీపీ అభ్యర్ధి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రాజంపేట ఎంపీ పీవీమిథున్రెడ్డిపై పచ్చమూకల దాడి చేయడం హేయమైన చర్యగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాఽథరెడ్డి అభివర్ణించారు. రాజంపేటలోని ఆకేపాటి భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల స్వేచ్ఛాయుత వాతవరణంలో జరగాల్సిందిపోయి, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పతనానికి ఇది నాంది అని ఎద్దేవా చేశారు.
రాజంపేట మున్సిపాలిటి ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు వ్యవహారించిన తీరు రాజంపేట చరిత్రలో మాయనిమచ్చగా మిగిలిపోతుందని ఎమ్మెల్యే ఆకేపాటి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తొలిరోజు నామినేషన్ వేయనీయకుండా పోలీసుల సమక్షంలో అడ్డుకోవడం దారుణమన్నారు.ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్రెడ్డి, రాజంపేట మున్సిపల్చైర్మన్ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.


