బద్వేలు: జిల్లాలోని పంచాంగ కర్తలకు,జ్యోతిష్యులకు,వేద పండితులకు డిమాండ్ పెరిగింది. పురపోరుకు షెడ్యూల్ విడుదలవడం.. శుక్రవారం వారం నుంచే నామినేషన్ మొదలుకావడంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నామినేషన్ వేసేందుకు తిథి..నక్షత్రం, టైం,రోజు తదితర కార్యాక్రమాలకు ముహూర్తం పెట్టించుకుంనేందుకు జాతకాలు చెప్పే పురోహితులు,పంచాంగ కర్తలు,వేదపండితల దగ్గరకు పరుగులు పెడుతున్నారు.ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. దీంతో మంచిముహూర్తాలు చెప్పండి అంటూ పండితులను ఆశ్రయిస్తున్నారు. విజయానికి మొదటి మెట్టు నామినేషన్ మంచి ముహూర్తంలో వేయడమేనన్న నమ్మకం అభ్యర్థుల్లో నాటుకు పోయింది.మరో అడుగు ముందుకేసి ఏ దిక్కు నుంచి ప్రచారం చేస్తే గెలుపు గుర్రాలను ఎక్కవచ్చని జ్యోతిష్యుల ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
పంతుళ్ల వద్దకు నామినేషన్లు వేసే అభ్యర్థులు


