రాజకీయ నాయకుల చిత్రపటాల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ నాయకుల చిత్రపటాల తొలగింపు

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

కడపకార్పొరేషన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన జరుగుతోందని ఈనెల 16వ తేదీ సాక్షిలో వార్త ప్రచురితమైన నేపథ్యంలో నగరపాలక అధికారులు స్పందించారు. ఈ మేరకు రాజకీయ ప్రచార చిత్రాలు, బస్టాండు ప్రాంగణలోని హోర్డింగ్‌, రాజకీయ నాయకుల చిత్రపటాలను తొలగించినట్లు కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

టీడీపీకి చంద్రశేఖర్‌రెడ్డి

రాజీనామా

కడపకార్పొరేషన్‌: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నగర కోశాధికారి ఎం. చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరి, రెండున్నరేళ్లలో ఆ పార్టీ కోసం, ఎమ్మెల్యే మాధవీరెడ్డి కోసం నీతి నిజాయితీగా పనిచేశానన్నారు. కానీ తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేశానన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు.

ఓటుకోసం హైకోర్టును

ఆశ్రయించిన రాఘవరెడ్డి

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తనకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ టీడీపీ నాయకుడు నంద్యాల రాఘవరెడ్డి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందుగానే ఓటు కోసం దరఖాస్తు చేశానని, తనకు ఓటు హక్కు కల్పించాలని కోరారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని కామనూరులో ఉన్న తన ఓటును మున్సిపాలిటీలోకి బదిలీ చేయాలని తాను గతంలో దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. ఈ మేరకు రాఘవరెడ్డికి ఓటు హక్కు కల్పించాలని కోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి వి.వెంకటపతికి లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement