బీహారును తలపించేలా పురపాలక ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

బీహారును తలపించేలా పురపాలక ఎన్నికలు

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

రాజంపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పురపాలకసంఘం ఎన్నికలు బీహారును తలపించే విధంగా జరుగుతున్నాయని ప్రజాస్వామ్యవ్యవస్థ అపహాస్యం పాలైందని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. మేడాభవన్‌లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై 2వేల మందికిపైగా టీడీపీ గుండాలు దౌర్జన్యం చేస్తుంటే కలెక్టరు,ఎస్పీ కూడా రక్షణ ఇవ్వలేని స్ధితిలో ఉన్నారన్నారు. రాజంపేటలో చమర్తి జగన్‌మోహన్‌రాజు ఆధ్వర్యంలో వందమంది టీడీపీ గుండాలు మున్సిపాలిటీ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారన్నారు. నామినేషన్‌ వేయుకుండా చేయడంపై పోలీసు,రెవెన్యూ కూడా ఏ చర్యలు తీసుకోలేదని స్థితిలో ఉన్నారన్నారు. భవిష్యత్తులో ఇలానే ఉండదని, చాలామార్పు ఉంటుందని లోకేష్‌కు హితవు పలికారు. ఈ అరాచకాలపై పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, హైకోర్టులోనూ రిట్‌ పిటిషన్‌ వేశామని తెలిపారు. గవర్నర్‌ జోక్యం చేసుకుని ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని, దౌర్జన్యాలకు భయపడి వెనుకంజ వేసే ప్రసక్తి లేదని రఘునాథరెడ్డి స్పష్టం చేశారు.కార్యక్రమంలో సీనియర్‌ వైఎస్సార్‌సీపీనేత ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏకులరాజేశ్వరీరెడ్డి, ఒంటిమిట్ట మండలకన్వీనరు టక్కోలు శివారెడ్డి పాల్గొన్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి హేయనీయం : మేడా రఘునాథరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement