బాలికపై లైంగిక దాడి యత్నం: నిందితుడికి జైలు | - | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి యత్నం: నిందితుడికి జైలు

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

ఒంటిమిట్ట: మండల పరిధిలోని కొటికవారిపల్లి గ్రామంలో 3 ఏళ్ల కిందట మైనర్‌ బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడికి 5 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఒంటిమిట్ట పోలీసులు తెలిపిన వివరాల మేరకు...కొటికవారిపల్లి గ్రామంలో మేకలు మేపుకుని ఇంటికి వస్తున్న 16 సంవత్సరాల బాలికను 2023 సంవత్సరం మే 5వ తేదీన అదే గ్రామానికి చెందిన కొటికె బ్రహ్మయ్య(21) అడ్డగించి, కత్తితో బెదిరించి, బలవంతంగా ఒక గుంతలోకి లాక్కుని వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బాలిక ప్రతిఘటించడంతో దాడి చేసి, తిరిగి లైంగిక దాడికి ప్రయత్నించాడు. చివరికి బాలిక తప్పించుకుని జరిగిన విషయాన్ని తన బంధువులకు తెలియజేసింది. వారు ఒంటిమిట్ట పోలీసు స్టేషన్‌ లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. ఒంటిమిట్ట పోలీసులు నమోదు చేసిన ఈ కేసును విచారించిన కడప పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.ఎ. సోమశేఖర్‌ నిందితుడిని దోషిగా తేల్చారు. నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ. 4,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement