యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి

Aug 29 2026 1:34 AM | Updated on Aug 29 2026 1:34 AM

జెన్‌ జీ ఉద్యమమే స్ఫూర్తి

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండి వినీత్‌ రెడ్డి

ప్రొద్దుటూరు : యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండి వినీత్‌ రెడ్డి కోరారు. వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం శ్రీయూత్‌ మీట్‌శ్రీ నిర్వహించారు. కార్యక్రమానికి రాచమల్లు శివప్రసాదరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బండి వినీత్‌ రెడ్డి మాట్లాడుతూ రాబోయే తరం యువకులదేనన్నారు. అందుకు ఉదాహరణే ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్‌జీ ఉద్యమం అన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన విధానాన్ని యువత గుర్తించాలని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంతో యువతకు ఉపయోగపడుతుందన్నారు. అందుకు సంబంధించిన విషయాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఏఐపై మరో మారు సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళికలను వివరిస్తానన్నారు. ప్రొద్దుటూరు నుంచి మొదలైన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు యువత నడుం బిగించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి సోదరుడు కిరణ్‌కుమారరెడ్డి తనయుడు రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. ఎప్పటి నుంచో ఉన్న పార్టీలను కాదని తమిళనాడులో విజయ్‌ సీఎం కావడానికి ప్రధాన కారణం యువతే అన్నారు. జెన్‌జీ ఉద్యమం ప్రభావం వల్ల కేంద్ర మంత్రి సైతం రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.

యువతకు ప్రాధాన్యత

యువతకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. యువతకు సంబంధించిన నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల అమలు తీరును ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన బావమరిది బంగారు మునిరెడ్డి ఏవిధంగా తనకు సహకరిస్తున్నారో అలాగే భవిష్యత్తులో రాఘవేంద్రారెడ్డికి వినీత్‌ రెడ్డి సహకారం అలానే ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, దొరసానిపల్లె మాజీ ఉపసర్పంచ్‌ మార్తల లక్ష్మీనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ మార్తల ఓబుళరెడ్డి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వెఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండి వినీత్‌ రెడ్డి, పాల్గొన్న యువత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement