– సాక్షి కథనానికి స్పందించిన
ఉన్నతాధికారులు
రాజంపేట: జిల్లాలో రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో వెంకటాద్రి హాల్టింగ్‌పై రైల్వే ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వెంకటాద్రి హాల్టింగ్‌కు పొలిటికల్ బ్రేక్ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. రాజ్యసభ సభ్యుడు, రైల్వేప్లానింగ్ కమిటీ సభ్యులు మేడా రఘునాథరెడ్డితో శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులు సంప్రందించారు. వెంకటాద్రి హాల్టింగ్ విషయంలో ఆలస్యమైన అంశంపై ఎంపీకి వివరించారు. ప్రధానంగా సౌత్‌సెంట్రల్ రైల్వే నుంచి ఏపీకి ఎస్‌సీవోఆర్ జోన్ ఏర్పడటం వల్ల వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్ హాల్టింగ్ కల్పించే విషయంలో జాప్యం జరిగిన అంశాన్ని వివరించారు. రైల్వేబోర్డు ఉన్నతాధికారుల నిర్ణయం తీసుకొని త్వరలో హాల్టింగ్ తేదీని ఖరారు చేస్తామని ఎంపీకి తెలిపారు. రెండోవారంలో వెంకటాద్రికి హాల్టింగ్ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని కూడా వివరించారు. ఆరునెలల పాటు వెంకటాద్రి హాల్టింగ్ పెండింగ్‌లో పడిన సంగతి అందరికి తెలిసిందే. త్వరలో హాల్టింగ్‌ను ప్రకటిస్తామని రైల్వే ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.


