ఎరువు కోసం ఏకరువు | - | Sakshi
Sakshi News home page

ఎరువు కోసం ఏకరువు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకం!

జిల్లాలో విత్తనాలు, ఎరువుల తీవ్ర కొరత

ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని,

గిట్టుబాటు ధర కల్పించలేదని

అన్నదాతల ఆగ్రహం

కడప అగ్రికల్చర్‌ : -Q-È‹œ ïÜf-¯Œl {´ëÆý‡…¿ê°MìS Ð]l¬…§ól hÌêÏÌZ° OÆð‡™èl-¯]l²-ÌS¯]l$ GÆý‡$-Ð]l#ÌS «§ýlÆý‡Ë$ ¿ýæÄ¶æ$ò³-yýl$-™èl$-¯é²Æ‡$$. JMýS-OÐðlç³# Ðé™é-Ð]l-Æý‡×æ Ð]l*Æý‡$µ-ÌS™ø ç³…rË$ çÜÇV> ç³…yýl-MýS-´ùÐ]l-yýl…, Ð]l$ÆøOÐðlç³# ç³…yìl¯]l ç³…rMýS$ {糿¶æ$™èlÓ… Wr$t»êr$ «§ýlÆý‡ MýSÍ-µ…-^èl-MýS-´ù-Ð]lyýl…™ø Cç³µ-sìæMóS Ð]lÅÐ]l-ÝëĶæ$… ¿êÆý‡…V> Ð]l*Ç…-¨. D {MýSÐ]l$…ÌZ QÈ‹œ ò³r$t-º-yýl$ÌS MøçÜ… G§ýl$-Æý‡$-^èl*çÜ$¢¯]l² çÜÐ]l$-Ķæ*°MìS M>…ò³ÏMŠSÞ GÆý‡$-Ð]l#ÌS «§ýlÆý‡Ë$ ºÝë¢Oò³ ₹200 ¯]l$…_ ₹450 Ð]lÆý‡MýS$ ò³Æý‡-VýS-yýl…™ø MýSÆý‡Û-MýS$Ë$ Ð]l$Ç…™èl MýS$…W´ù-™èl$-¯é²Æý‡$. ïÜf-¯Œl {´ëÆý‡…-¿ýæ-Ð]l$-Ð]l#™èl$¯é² ¯ólsìæMîS Ñ™èl¢-¯éË$, GÆý‡$-Ð]l#Ë$ OÆð‡™èl$-ÌSMýS$ A…§ýl$-»ê-r$ÌZMìS Æ>Ð]l-yýlÐól$ Ìôæ§ýl$. ©…™ø D Hyé¨ QÈ‹œ ÝëVýS$ {ç³Ô>²-Æý‡¦-MýS…V> Ð]l*Ç…-¨.

లక్షలాది ఎకరాల్లో సాగు..

నేటికీ దొరకని విత్తనాలు!

జిల్లాలో లక్షలాదిమంది రైతులు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీఫ్‌లో ముఖ్యంగా వేరుశనగ, కంది, ఆముదంతో పాటు జొన్న, వరి, అలసంద, ఉలవ తదితర పంటలు సాగు కానున్నాయి. భూములు సిద్ధమైనా ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు, సరిపడా ఎరువులు ముందస్తుగా సొసైటీలు, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

మద్దతు ధర కరువు..

చంద్రబాబు ప్రభుత్వంపై మండిపాటు

గత రబీ సీజన్‌ లో నీటి వసతి ఉండి కష్టపడి పంటలు పండించినా.. వాటికి కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని, ఇప్పు డు ఎరువుల ధరలు కూడా పెంచితే తాము వ్యవసాయాన్ని వదిలేయాల్సి వస్తుందని గాలివీడు పరివాహక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్షణమే విత్తనాలు, ఎరువులు

సరఫరా చేయాలి

ఇప్పటికై నా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి జిల్లావ్యాప్తంగా అవసరమైన వేరుశనగ, ఇతర విత్తనాలను, ఎరువులను సబ్సిడీపై తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బ్లాక్‌ మార్కెట్‌ కాకుండా పాత ధరలకే ఎరువులు లభించేలా కఠిన నిఘా పెట్టాలని కోరుతున్నారు.

పాత స్టాక్‌ను

పాత ధరలకే అమ్మాలి

రైతులు కూడా బస్తాపై ఉన్న ధరనే చెల్లించాలి

జిల్లా వ్యవసాయ అధికారి

మట్టా సుబ్రమణేశ్వరావు

కడప అగ్రికల్చర్‌ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచిందని, ఈ విషయాన్ని ప్రతి రైతు గమనించాలని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు అన్నారు. అయితే పాత స్టాక్‌ను మాత్రం పాత ధరలకు అమ్మాలని డీలర్లు, వ్యాపారులకు సూచించారు. రైతులు కూడా బస్తాపై ఉన్న రేట్లను మాత్రమే చెల్లించాలని తెలిపారు. అలాగే కొత్త స్టాక్‌ను మాత్రం పెంచిన ధరలను అమ్మాలని డీలర్లకు సూచించారు. ఈ అంశంపై నిరంతరం పర్యవేక్షించమని ఏడీఏలు, వ్యవసాయ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement