విద్యార్థీ.. విజయీభవ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థీ.. విజయీభవ

Feb 23 2026 7:30 AM | Updated on Feb 23 2026 7:30 AM

విద్య

విద్యార్థీ.. విజయీభవ

17100

పరీక్షా కేంద్రంలో డిఈసీ సభ్యులతో కలిసి ఏర్పాట్లును పరిశీలిస్తున్న ఆర్‌ఐవో వెంకటేశ్వర్లు

కడప ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు వేళయింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న థియరీ పరీక్షలకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 23న ప్రథమ సంవత్సర పరీక్షలు, 24వ తేదీ ద్వితీయ సంవత్సర పరీక్షలు మొదలు కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 9 గంటలు దాటిన తరువాత పరీక్షా కేంద్రంలోని అనుమతించబోమని ఇంటర్‌ అధికారులు స్పష్టం చేశారు. అలాగే పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బంది సెంటర్లలోకి సెల్‌ఫోన్స్‌ తీసుకురాకూడదని ఇంటర్‌బోర్డు ఆదేశించింది. పరీక్షా కేంద్రంలో ఒక ఛీప్‌సూపరింటెండెంట్‌కు మాత్రం సమాచారం తెలిపేందుకు ఇంటర్‌ బోర్డు సరఫరా చేసిన ఫోన్‌ను అనుమతిస్తారు.

పరీక్షా కేంద్రాలకు సామగ్రి...

పరీక్షలకు సంబంధించిన సామగ్రిని పోలీసు పహారాలో స్టోరేజ్‌ పాయింట్లకు చేరవేశారు. అలాగే పరీక్ష కేంద్రాలకు అన్సర్‌ బుక్‌లేట్స్‌, ఓఎంఆర్‌ సీట్లు ఇతర పరీక్షా సామాగ్రి అధికారులు చేరవేశారు.

● పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తోపాటు పోలీసుల బందోబస్తు కల్పించనున్నారు. అలాగే మెడికల్‌ సిబ్బందితో ప్రాథమిక చికిత్స సేవలు అందుబాటులో ఉంచనున్నారు.

● పరీక్షా కేంద్రాలలో ప్రతి గదిలో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. వాటిని ఇంటర్‌బోర్డు, జిల్లా ఆర్‌ఐఓ కార్యాలయానికి స్ట్రీమింగ్‌ ద్వారా అనుసంధానం చేశారు.

● బస్సు సౌకర్యం ఉన్న విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూసి ఉచితంగా బస్సు ప్రయాణం చేసేలా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇందుకోసం ఆర్టీసీ పలు రూట్లకు బస్సులను సర్వీసులు నడుపుతోంది.

● పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్‌ సెంటర్లు తెరవకూడదని అధికారులు ఆదేశించారు.

● పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్‌, డిజిటల్‌ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు.

జిల్లాలో 9 సమస్యాత్మక కేంద్రాలు ...

జిల్లాలో 09 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. సంబంధిత పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఖాజీపేట ఏపీ మోడల్‌స్కూల్‌, ఖాజీ పేట ఆర్‌ఈఎస్‌వీ జూనియర్‌ కళాశాల, ఒంటిమిట్ట, ఉప్పరపల్లె ఎస్‌బీఆర్‌ఎస్‌, ఎర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వేముల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మఠం ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌, పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పులిరెడ్డిపేట శ్రీనివాస జూనియర్‌ కళాశాల, కమలాపురం ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ కళాశాలలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

టోల్‌ ప్రీ నెంబర్‌ ఏర్పాటు...

విద్యార్థులకు ఏవైనా సమస్యలంటే ఫిర్యాదు చేసేందుకు అనువుగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. 08562–244171 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.

సిట్టింగ్‌ స్క్వాడ్‌ టీంలు

డీఈసీ సభ్యులు

నేటి నుంచి ఇంటర్‌పరీక్షలు ప్రారంభం

సీసీ కెమెరాల నిఘాలోపరీక్షల నిర్వహణ

టోల్‌ ఫ్రీ నంబర్‌..08562–244171

800

03

విద్యార్థీ.. విజయీభవ 1
1/1

విద్యార్థీ.. విజయీభవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement