భక్తిశ్రద్ధలతో పార్వేట
రాయచోటి టౌన్: శ్రీ వీరభద్రస్వామి వారి పార్వేట ప్రశాంతంగా ముగిసింది. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పార్వేట నిర్వహించారు. గతేడాది నిర్వహించిన పారువేట సందర్భంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీతో పాటు డీఎస్పీ, సీఐ లు, ఎస్‌ఐలు ఇతర పోలీసుల బలగాలు సుమా రు 400 మందికి పైగా బందోబస్తు నిర్వహించారు. శ్రీ భద్రకాళీ సమేతుడు సాయంత్రం 4 గంటలకు ఆలయ వేదపండితులు, ఆలయ ప్రధాన అర్చకుల వేదమంత్రోచ్ఛరణలతో వివిధ రకాల కళాకారుల నృత్యప్రదర్శనలతో పారువేటకు బయలుదేరారు. ఆలయ నుంచి స్వామి, అమ్మవార్లు అశ్వవాహనంపై వేటకు వెళ్లే కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు తిరుమల మనోజ్ కుమార్, ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి పర్యవేక్షించారు. ఆలయ వీధులు, గాంధీ బజార్, ఠానా , రవిహాల్ సమీపంలోని నాలుగు కాళ్ల మండపం వరకు పార్వేట సాగింది.
కడప అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని ఆధ్వర్యంలో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ మేరకు కడపలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం న్యాయమూర్తులతో ముందస్తు జాతీయ లోక్ అదాలత్ మీటింగ్ నిర్వహించా రు. ఎక్కువ సివిల్ కేసులు, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు రాజీ అయ్యే విధంగా ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహించాలని వివరించారు. మరింత సమాచారం కోసం 08562 258622, 244622 నంబర్‌తో పాటు డిస్ట్రిక్ట్. ఈకోర్ట్స్.జిఓవి. ఇన్/కడప,డిఎల్‌ఎస్‌ఏకెడిపిఅట్‌దిడేటాఫ్‌జీమెయిల్ డాట్‌కామ్ ద్వారా సంప్రదించాలని సూచించారు.
భక్తిశ్రద్ధలతో పార్వేట


