వ్యాపారానికి రాజంపేట అనువైన ప్రాంతం
రాజంపేట టౌన్: వ్యాపార రంగానికి రాజంపేట అనువైన ప్రాంతమని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్‌ఎస్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చందన షాపింగ్‌మాల్‌ను ఆదివారం మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే చందన షాపింగ్ మాల్స్ రాజంపేటలోనూ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సందడి చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్
చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకలో సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొని సందడి చేశారు. నిధి అగర్వాల్‌ను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. పలువురు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపగా, ఆమె సైతం అంతే ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి
వ్యాపారానికి రాజంపేట అనువైన ప్రాంతం
వ్యాపారానికి రాజంపేట అనువైన ప్రాంతం


