నేడు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’

Feb 23 2026 7:30 AM | Updated on Feb 23 2026 7:30 AM

నేడు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’

నేడు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’

నేడు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’

కడప కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్‌ యువర్‌ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్‌ నంబరు: 8977716661కు కాల్‌ చేసి తమ విద్యుత్‌ సమస్యలను సీఎండి దృష్టికి తీసుకురావచ్చు.

సర్కిల్‌ స్థాయిలోనూ డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

అలాగే సర్కిల్‌ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ’డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్‌ సమస్యలను సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ దృష్టికి తీసుకువచ్చే అవకాశాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ కల్పించింది. ఇందులో అన్నమయ్య జిల్లా ప్రజలు 9440817449కు, వైఎస్సార్‌ కడప జిల్లా వినియోగదారులు 08562242457కు కాల్‌ చేసి సమస్యలు తెలపవచ్చు. ఈ అవకాశాన్ని విద్యుత్‌ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement