కాఫీ పెట్టండి.. సారూ! | - | Sakshi
Sakshi News home page

కాఫీ పెట్టండి.. సారూ!

Feb 22 2026 7:15 AM | Updated on Feb 22 2026 7:15 AM

కాఫీ

కాఫీ పెట్టండి.. సారూ!

విస్తరిస్తే పరిశ్రమ అవుతుంది

బి.కొత్తకోట: మూడున్నర దశాబ్దాల క్రితం అటవీశాఖ చేసిన ఓ మంచి కాఫీ లాంటి ప్రయోగం ఫలించగా, ఆచరణలో విఫలమైంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉన్న బి.కొత్తకోట మండలంలోని వేసవి విడది కేంద్రం, ఆంధ్రాఊటీ హార్సిలీహిల్స్‌ ప్రకృతి ప్రయోగాలకు వేదిక. ఇందులో ఎన్నో ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. అందులో మొక్కలపై ఎన్నో ప్రయోగాలు చేయగా వాటి ఆనవాళ్లు ఇప్పుడు లేవు. ఇందులో ఒకటి కాఫీ మొక్కల పెంపకం. అతిచల్లని అరకు లాంటి ప్రాంతాలకే పరిమితమైన కాఫీతోటల పెంపకం 1990లో ప్రయోగాత్మకంగా హార్సిలీహిల్స్‌పై చేపట్టారు.

ప్రయోగం ఫలించింది

మొదటి సారిగా 1990లో ఇక్కడ కాఫీతోటలు సాగు చేయాలన్న ఆలోచన అటవీశాఖకు కలిగింది. దాంతో అప్పటి అధికారులు కాఫీ మొక్కలను నాటి వాటి ఎదుగుదల, దిగుబడి, నాణ్యతను పరిశీలించారు. వాటిని నాటిన తర్వాత అవి మొక్కలై మంచి దిగుబడి ఇవ్వడంతో పాటు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. దాంతో సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో.. వేసవిలో సాధారణ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, శీతాకాలం ఉదయం సమయంలో ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోతుంది. ఈ స్థాయి ఉష్ణోగ్రతలున్నా కాఫీతోటల పెంపకం విజయవంతమైంది. కొండపైన అటవీప్రాంగణం, ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద కాఫీ తోటలను పెంచారు. ఇవి ఏటా దిగుబడిని ఇస్తున్నాయి. అయితే వీటి నిర్వహణ సక్రమంగా లేకపోయినా దిగుబడి బాగా వస్తోంది. ప్రస్తుతం కాఫీ మొక్కల నిండా గింజలు కనిపిస్తున్నాయి. ఈ మొక్కల భాగాలను కత్తిరించి వేయడంతో ఒక స్థాయి వద్ద ఎదుగుదల ఆగిపోయింది.

సేకరణ వదిలేశారు: కొండపై రెండుచోట్ల ఉన్న కాఫీతోటల నుంచి మంచి దిగుబడి వస్తోంది. వీటినుంచి మొదట్లో కాఫీ గింజలను సేకరించారు. తర్వాత దీనిపై నిర్లక్ష్యం పెరగడంతో వాటి నిర్వహణ, సస్యరక్షణ చర్యలను పూర్తిగా వదిలేశారు. దీనిఫలితంగా దిగుబడి వస్తున్నా వాటిని ఆదాయంగా మార్చుకునేందుకు అటవీశాఖ ఆసక్తి చూపడం లేదు. ఈ దిగుబడిలో కొంత కోతులు తింటుండగా, మిగిలినవి వృధాగా నేలరాలిపోతున్నాయి. ఆదాయం వచ్చే ఈ కాఫీ గింజలను సేకరించేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదు.

హార్సిలీహిల్స్‌పై అటవీప్రాంగణంలో కాఫీతోట ఘాట్‌రోడ్డులో కాఫీతోట

తూర్పు కనుమలతో విడిపడిన హార్సిలీహిల్స్‌ దట్టమైన అడవులతో కూడుకున్నది. జీవవైవిఽ ద్యం పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కొండ అడవి తూర్పున కురబలకోట మండలం, దక్షిణాన కర్ణాటక రాష్ట్రానికి విస్తరించి ఉంటుంది. 8,755 హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అటవీప్రాంతం ఉంది. ఇందులో రిజర్వ్‌ఫారెస్ట్‌ 6,231 హెక్టార్లుందని 1882లోనే 16వ సెక్షన్‌ కింద ప్రభుత్వం ప్రకటించింది. కాఫీ తోటల పెంపకం విజయవంతమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ అడవిలో, ఘాట్‌రోడ్డు సమీపంలోని మైదాన భూమిపై వీటిని పెంపకాన్ని చేపట్టి విస్తరిస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఉపాఽధి, ఉద్యోగ అవకాశాలు కలగడంతోపాటు అరకు కాఫీ లాగా హార్సిలీహిల్స్‌ పేరు బ్రాండ్‌గా మారే అవకాశం లేకపోలేదు. ఈ దిశగా అటవీశాఖ చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి.

హార్సిలీహిల్స్‌పై తోటల పెంపకం పట్ల అటవీశాఖ నిర్లక్ష్యం

ప్రయోగం సఫలం..ఆచరణ విఫలం

మంచి దిగుబడి ఉన్నా సేకరణ లేదు

సాగు విస్తీర్ణం పెంచితే మార్కెటింగ్‌కుపుష్కలంగా అవకాశాలు

అరకు కాఫీని ఆదర్శంగాతీసుకోవాలంటున్న పరిశీలకులు

విస్తరణకు పరిశీలన

హార్సిలీ హిల్స్‌ పై కాఫీ తోటల నిర్వహణ, విస్తరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అటవీ ప్రాంగణంలో కొత్తగా కాఫీ తోటల పెంపకానికి భూమి లేదు. కొండలో అనువైన ప్రాంతాన్ని గుర్తించి.. దీనిపై నివేదిక ప్రభుత్వాన్ని పంపుతాం. తోటల నుంచి గింజలను సేకరించేందుకు చర్యలు తీసుకుంటాం.

– జయప్రసాదరావు, మదనపల్లె రేంజర్‌

కాఫీ పెట్టండి.. సారూ! 1
1/4

కాఫీ పెట్టండి.. సారూ!

కాఫీ పెట్టండి.. సారూ! 2
2/4

కాఫీ పెట్టండి.. సారూ!

కాఫీ పెట్టండి.. సారూ! 3
3/4

కాఫీ పెట్టండి.. సారూ!

కాఫీ పెట్టండి.. సారూ! 4
4/4

కాఫీ పెట్టండి.. సారూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement