అభివృద్ధి పనులు ప్రారంభం
ఒంటిమిట్ట: ఏకశిలానగరి శ్రీ కోదండ రామస్వామి సన్నిధి ఆవరణలో శనివారం రూ.18 లక్షల నిధులతో పలు రకాల పనులను ప్రారంభించినున్నట్లు టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డి శనివారం తెలిపారు. ఇందులో ఇప్పటికే ఆలయ లడ్డూ కౌంటర్ వద్ద నుంచి టీటీడీ పరిపాలన భవనానికి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. అలాగే అలంకార మండపం వద్ద కూడా మరమత్తుల పనులు చేయాలని, ఆలయానికి దక్షణ–పడమర వైపు కలిసే మాడ వీధులవద్ద ఉన్న గేటు దగ్గర స్వామి వారి రథం వెల్లేందుకు ఇంకా విశాలంగా ఉండేలా పనులు చేయాల్సి ఉందన్నారు. గ్రామ పురవీధుల్లో స్వామి వారి రథం తిరిగే 300 మీటర్ల బీటీ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.


