సీమ లిఫ్ట్ కోసం ఉద్యమం
రాయలసీమ నీటి ప్రాజెక్టులపై రాయచోటిలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు
రాయచోటి: రాయలసీమకు సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టును నిలిపేసి తాను పుట్టిన ప్రాంతానికి సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నమయ్య జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సీమ ప్రయోజనాలను గాలికొదిలేసి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో దాదాపు పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ పనుల్ని చంద్రబాబు నిలిపేయడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు తన తప్పు తెలుసుకుని సీమ లిఫ్ట్ పనులు ప్రారంభించకపోతే మార్చి 1న పార్టీలకతీతంగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని వారు హెచ్చరించారు.
చంద్రబాబు సీమ ద్రోహి: సురేష్‌బాబు, కడప మాజీ మేయర్
గతంలో తానే దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయిలను ప్రధానుల్ని చేశానని చెప్పుకున్న చంద్రబాబు 1995లో వెలుగోడు, బ్రహ్మసాగర్ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ఒక్క రూపాయి నిధులివ్వలేదన్నారు. 1996, 1998లో ఉప ఎన్నికలు జరిగితే మళ్లీ టెంకాయలు కొట్టాడు కానీ రూపాయి కేటాయించలేదని పేర్కొన్నారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు.. ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు ఇవ్వాలన్న ఆలోచన చేసిన పాపానపోలేదని విమర్శించారు.
చంద్రబాబు కుయుక్తుల్ని అడ్డుకుంటాం: పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్యే
చంద్రబాబు ఎన్ని ప్రాజెక్టులు ఆపేశాడో ఆయనకు తెలుసు. రాయలసీమ ప్రజలందరికీ తెలుసు. కుప్పానికి కూడా చంద్రబాబు చేసిందే మీ లేదు. ఈ మధ్య ఓ ఇల్లు కట్టుకోవడం తప్ప కుప్పానికి ఏమీ చేయలేదు. రాయలసీమకు బాబు అన్యాయమే చేశాడని మండిపడ్డారు.
వైఎస్‌ఆర్ రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలని ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలని చూస్తే సొంత పార్టీ కాంగ్రెస్‌లోనే చాలా మంది వ్యతిరేకించారని ఎమ్మెల్యే ఆకేపటి పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఎవర్నీ లెక్కచేయకుండా వైఎస్సార్ ముందుకెళ్లారన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రాజెక్టుల విషయంలో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. తిరిగి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అంతా సిద్దం చేసిన తరుణంలో బాబు సర్కారు మూలనపారేశారన్నారు. చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో రాయలసీమ లిఫ్ట్ ఆపానని రేవంత్‌రెడ్డి చెప్పుకున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్యే ఆకేపాటి దుయ్యబట్టారు.
మార్చి 1న కార్యాచరణ ప్రకటిస్తాం
రాయలసీమ నీటి బాధలు పట్టని చంద్రబాబు
జగన్ చేపట్టినసీమ లిఫ్ట్‌ను గాలికొదిలేశారు
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రం తాకట్టు
మీడియా సమావేశంలోధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ నాయకులు


