24న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్/చింతకొమ్మదిన్నె: చింతకొమ్మదిన్నె మండలంలోని చిన్నపల్లి యోగి శ్రీ నరసింహ్మ స్వామి ఆరాధన సందర్భంగా ఈ నెల 24న రాష్ట్రస్థాయి ఓల్డ్ కేటగిరీ ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త గోసుల మునిరెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి రూ. 70,016, రెండవ బహుమతి రూ. 50,016, మూడవ బహుమతి రూ. 30,016, నాల్గవ బహుమతి రూ. 20,016, ఐదవ బహుమతి రూ. 15,016, ఆరవ బహుమతి రూ. 10,016 బహుమతులు ఉంటాయన్నారు. ఆసక్తి గల ఎడ్ల యజమానులు వివరాలకు 98669 32301 అనే నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఒంటిమిట్ట: ఏకశిలానగరిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆవరణలో శనివారం హైదరాబాద్ కు చెందిన శ్రీ వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నాదోపాసన సాంస్కృతిక కార్యక్రమం భక్తులను అలరించింది. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారాముల కల్యాణంపై కర్నాటిక్ క్లాసికల్ గాయకుడు పి.శ్రీనివాసకుమార్ సంకీర్తనలు పాడి భక్తులను మంత్రముగ్దులను చేశారు. అనంతరం హరికథను భక్తుల కళ్ళకు కట్టినట్టు వినిపించారు.
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్‌లు మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి.. గర్భాలయంలోని మూలవిరాట్‌కు సమర్పించారు. నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలను తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని ఇంటర్మీడియట్ ఆర్‌ఐఓ టీఎన్‌వీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై శనివారం ఆర్‌ఐఓ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 23 నుంచి ప్రారంభమై మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షల కోసం జిల్లాలో 62 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. సంబఽంధిత పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత కట్టుదిట్టంగా జరుగుతాయని వివరించారు. 17,100 ప్రథమ సంవత్సర విద్యార్థులు, 16564 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. విద్యార్థులు సహాయం కొరకు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08562 244171 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరికైనా సమస్యలుంటే ఫోన్ చేయవచ్చునని తెలిపారు.
24న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
24న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు


