బ్రహ్మోత్సవాల ధ్వజావరోహణ
ఉత్సవ మూర్తులకు వసంతాలు పోస్తున్న వేదపండితులు
హంస వాహనంపై ఊరేగుతున్న శ్రీభద్రకాళీ సమేతుడు
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి శనివారం ధ్వజావరోహణ నిర్వహించారు. శనివారం ఉదయం ఉత్సవమూర్తులు, పూర్ణకుంభాలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఓంకార స్వామి, రాచరాయయోగి స్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణయ్యస్వామి, శంకరయ్య స్వామి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దగ్గర కంకణ విసర్జన పూజలు నిర్వహించారు. అంతకు ముందగా యాగశలలో పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్‌కుమార్, ఆలయ ఈవో డీవీ రమణా రెడ్డిలు కుటుంబ సమేతంగా.. పాలక మండలి సభ్యులు భకిశ్రద్ధలతో హోమం నిర్వహించారు. చివరిగా మహాపూర్ణాహుతి సమర్పించారు.
రాయంచపై భద్రకాళీ సమేతుడు
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడు హంసవాహనంపై రాచవీడు పురవీధులలో ఊరేగారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా శనివారం తొమ్మిదో రోజు ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్ కుమార్, ఆలయ ఈవో డీవీ రమణారెడ్డిల ఆధ్వర్యంలో స్వామివారిని మాఢవీధులలో ఊరేగించారు.
బ్రహ్మోత్సవాల ధ్వజావరోహణ


