కర్షకుడిపై కూటమి కక్ష! | - | Sakshi
Sakshi News home page

కర్షకుడిపై కూటమి కక్ష!

Jan 28 2026 7:04 AM | Updated on Jan 28 2026 7:04 AM

కర్షక

కర్షకుడిపై కూటమి కక్ష!

కర్షకుడిపై కూటమి కక్ష!

అన్నదాతలపై ప్రకృతే కాదు కూటమి సర్కారూ పగబట్టింది. నాలుగు నెలల క్రితం మోంఽథా తుపాన్‌ ప్రభావంతో

వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రైతులు భారీగా నష్ట పోయారు. కష్టంలోఉన్న రైతులకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ఒకటా రెండా నాలుగు నెలలుగా పరిహారం

అందించకుండా పరిహాసమాడుతోంది.

అధిక వర్షాల వల్ల మొలకెత్తిన మొక్కజొన్న విత్తనాలు

మొంథా తుపాన్‌తో నీట మునిగి దెబ్బతిన్న వరిపంట

కడప అగ్రికల్చర్‌: జిల్లాలో గతేడాది అక్టోబర్‌ నెలలో మోంఽథా తుపాన్‌ బీభత్సం సృష్టించింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 22 మండలాల పరిధిలో రైతులకు అపారనష్టం వాటిల్లింది. చేతికందే దశలో పంటలన్నీ వర్షార్పణమయ్యాయి. ముఖ్యంగా వరితోపాటు మినుము, కంది, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. జిల్లాలో బ్రహ్మంగారిమఠం, కాశినాయన, పోరుమామిళ్ల, బి.కోడూరు, కలసపా డు, వల్లూరు, పెద్దముడియం, పెండ్లిమర్రితోపాటు పలు మండలాల్లో 3546 మంది రైతులకు సంబంధించి 1944.20 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి పంట నష్టం ఇంకా అధిక మొత్తంలోనే ఉన్నప్పటికి ప్రభుత్వ పెద్దల మౌలిక ఆదేశాలతో నష్టం అంచనాల్లో కొంతమేర కోత విధించినట్లు అప్పల్లో చాలా మంది రైతులు వాపోయారు. తర్జనభర్జనల అనంతరం పంటనష్టం తుది జాబితా వెల్లడించిన అధికారులు జిల్లాలోని రైతులకు 480.78 లక్షలు పరిహారం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ నష్టం జరిగి నాలుగు నెలలు అవుతున్నా పరిహారం అందుకున్న పాపాన పోలేదనే విమర్శలు వస్తున్నాయి.

పరిహారం ఎప్పుడు...

మోంథా తుపాన్‌ చేసిన గాయానికి పరిహారం విడుదల చేసి మందు పూయాల్సిన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. పంటలు దెబ్బతిని నాలుగు నెలలు ముగుస్తున్నా కూటమి సర్కార్‌ నిధుల విడుదలల తీవ్ర జాప్యం చేస్తోంది. దీనికితోడు ఈ నెలాఖరుకు రబీ సీజన్‌ కూడా ముగుస్తుంది. అయినా నష్టపరిహారం గురించి ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదు. గ్రామాలకు వస్తున్న వ్యయసాయ అధికారులు, వారి సహాయకులను నష్ట పరహారం గురించి ప్రశ్నిస్తున్నా సరైన సమాధానం లేదని పలువురు రైతులు వాపోయారు.

మోంథా తుపాన్‌ నష్టం కలిగించింది

ఖరీఫ్‌లో సాగుచేసిన వరిపంట మోంథా తుపాన్‌ ప్రభావంతో పంట దెబ్బతింది. 2 ఎకరాల వరి సాగుకు రూ. 60 వేలు ఖర్చు చేశాను. తీరా పంట చేతికి అందే సమయానికి తుపాన్‌ వల్ల పంటనేలకొరిగి మోసులు వచ్చాయి. తుపానే రాకుంటే ఎకరాకు రూ. 60వేలు వచ్చేది. పెట్టుబడి అంతా నష్టపోయాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. – సంటెయ్య, రైతు, సిద్దవటం మండలం

రెండు లక్షలకుపైగా నష్టపోయా

గత ఏడాది ఖరీఫ్‌లో నేను 9 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాను. పంట బాగా వచ్చింది. తీరా దిగుబడి చేతి కొచ్చే సమయానికి మోంథా తుపాన్‌ ప్రభావంతో పంటంతా దెబ్బతింది. దీంతో మొక్కజొన్న విత్తనాలన్నీ మొలకొత్తి నాకు రెండు లక్షలపైగా నష్ట జరిగింది. – నామాల రమణయ్య దూలంవారిపల్లె. కలసపాడు మండలం

ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి

మోంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలి. సాగు చేసిన పంటలు దెబ్బతిని రైతులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారు. నష్టపరిహారం ఇంకెప్పుడిస్తారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారాన్ని అందించాలి. – సంబటూరు ప్రసాద్‌రెడ్డి,

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు

పరిహారం ఇవ్వకుండా వేధిస్తున్న చంద్రబాబు సర్కారు

పరిహారం కోసం వేలాదిమందిరైతుల ఎదురుచూపు

మోంథా తుపాన్‌తోఅన్నదాతలకు భారీగా నష్టం

కర్షకుడిపై కూటమి కక్ష! 1
1/5

కర్షకుడిపై కూటమి కక్ష!

కర్షకుడిపై కూటమి కక్ష! 2
2/5

కర్షకుడిపై కూటమి కక్ష!

కర్షకుడిపై కూటమి కక్ష! 3
3/5

కర్షకుడిపై కూటమి కక్ష!

కర్షకుడిపై కూటమి కక్ష! 4
4/5

కర్షకుడిపై కూటమి కక్ష!

కర్షకుడిపై కూటమి కక్ష! 5
5/5

కర్షకుడిపై కూటమి కక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement