నేడు జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు బుధవారం కడపలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ, డాన్‌బాస్కో ఐటీఐల సహకారంతో కడప సంధ్య కూడలిలోని డాన్‌బాస్కో ఐటీఐ ప్రాంగణంలో జరిగే జాబ్‌మేళాలో 25 కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పదవ తరగతి, ఆపై విద్యార్హత కలిగి 35 ఏళ్లలోపు వారు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
కడప అగ్రికల్చర్: జిల్లాకు మంగళవారం 1750 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రనాయక్ తెలిపారు. ఇందులో ప్రైవేటు డీలర్లకు 1000 మెట్రిక్ టన్నులను, 750 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్‌కు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ఎరు వుల కొరత లేదన్నారు. రైతులు కూడా అవసరం మేరకే ఎరువులను తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంట డీఏఓ కార్యాలయ ఏఓ గోవర్దన్ ఉన్నారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఆఫ్‌లైన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ టి.శ్రీనివాస్ తెలిపారు. బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీ ఉద్యోగుల ఎంపికలకు వైవీయూకు వస్తోందన్నారు. ఎం. ఎస్ ఆఫీస్‌పై ప్రాథమిక జ్ఞానంతో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలన్నారు. రెండు రౌండ్లు ఇంటర్వ్యూ ఆన్‌లైన్ అసెస్‌మెంట్, హెచ్ ఆర్ రౌండ్, ఆపరేషనల్ ( ఓపీఎస్ ) రౌండ్ ఉంటుందన్నారు. విద్యార్థులందరూ వారి రెజ్యూమ్ హార్డ్ కాపీతో నూతన పరిపాలనా భవనంలోని ప్లేస్‌మెంట్ సెల్‌లో ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని సూచించారు.
పులివెందుల టౌన్: పులివెందులకు చెందిన హాకీ క్రీడాకారుడు ఎం.సంజయ్ జాతీయ హాకీ జట్టుకు ఎంపికై నట్లు ఖేలో ఇండియా కోచ్ రవికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గతనెల్లో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలుర రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం.సంజయ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారన్నారు.


