కమిటీల డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
కడేప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ పాకా సురేష్ కుమార్‌లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కడప నియోజకవర్గంలో సుమారు 2 నెలల పాటు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి డివిజన్ కమిటీలను రూపొందించామన్నారు. ఇప్పుడు వాటిని డిజిటలైజేషన్ చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు, ఆర్గనైజేషన్ సెక్రటరీల సేవలను దీనికి ఉపయోగించుకోవాలన్నారు. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులు ప్రత్యేక చొరవ చూపి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇది పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు అందజేస్తామని వివరించారు. తమపై వస్తున్న అపోహలు, వదంతులను నమ్మవద్దని సూచించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ కడప నగరంలో ఒక సచివాలయాన్ని రెండుగా విభజించి కమిటీలను నియమించామని... డివిజన్ కమిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, యువజన, ఐటీ విభాగాలను నియమించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కమిటీల్లో ఉన్న వారి ఫోటోలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇందులో ఎలాంటి సమస్యలు ఏర్పడినా తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, డా. సొహైల్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, మాజీ కార్పొరేటర్ జమాల్‌వలీ, జోన్ అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్, రామ్మోహన్‌రెడ్డి, ఐస్‌క్రీం రవి, నాగమల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, డివిజన్ ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులు చొరవ తీసుకోవాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి


