నేడు వేమన జయంతి
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ‘ప్రజాకవి’వేమన జయంతిని నిర్వహించనున్నట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, ప్రధానవక్తగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, విశిష్ట అతిథులుగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ హాజరుకానున్నారని వివరించారు.
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలోని మైదానంలో విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో 8 జట్లు పాల్గొనగా రామేశ్వరం జట్టు విన్నర్స్‌గా, శివాలయం జట్టుగా రన్నర్స్‌గా నిలిచాయి. గెలుపొందిన క్రీడాకారులకు ఆడిటర్ మణికంఠ, డాక్టర్ సోమా లక్ష్మీనరసయ్య బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, విభాగ్ సంపర్క ప్రముఖ్ మల్లికార్జునరావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈసీ మెంబర్ డాక్టర్ వరుణ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడప అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలైన కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 2620 మెట్రిక్ టన్నుల ఎరువులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రా నాయక్ తెలిపారు. ఇందులో 2320 మెట్రిక్ టన్నుల యూరియా మరో 300 మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పోటాష్‌లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇందులో వైఎస్సార్‌జిల్లాకు సంబంధించి 1660 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారు. ఇందులో 1060 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 600 మెట్రిక్ టన్నులను మార్కెఫెడ్‌కు కేటాయించారు. మ్యూరేట్ ఆఫ్ పోటాష్‌కు సంబఽంధించి వైఎస్సార్‌జిల్లాకు 200 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇందులో 100 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 100 టన్నులు మార్క్‌పెడ్‌కు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదన్నారు.
నేడు వేమన జయంతి
నేడు వేమన జయంతి


