పార్టీ బలోపేతానికి కృషి
రాజంపేట: క్షేత్రస్ధాయిలో పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ఇందులో భాగంగా వివిధ స్ధాయి కమిటీలను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, పార్లమెంటరీ పరిశీలకులు సురేష్‌బాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఆకేపాటి ఎస్టేట్ సభాభవనంలో నియోజకవర్గ స్ధాయి గ్రామ, మండల, మున్సిపాలిటి పరిశీలకులు ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే ఆకేపాటి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కష్టకాలంలో అండగా నిలిచే కార్యకర్తలకు పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా న్యాయం చేసేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సరైన రీతిలో గుర్తింపు లభించే విధంగా ఇప్పటి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ద్వారా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నిజమైన ప్రతి కార్యకర్తకు గుర్తింపుకార్డు ఇస్తామని... ఈ గుర్తింపు కార్డే భవిష్యత్తులో ప్రామాణికంగా పార్టీ పెద్దలు తీసుకుంటారన్నారు. గ్రామకమిటి రాష్ట్ర కన్వీనరు వజ్రభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే నిజమైన కార్యకర్తకు గుర్తింపు కార్డుతోనే న్యాయం జరుగుతుందని వివరించారు. రాజంపేట నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి అనిల్‌రెడ్డి , రాజంపేట పురపాలకసంఘం చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి,వీరబల్లి ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్‌రెడ్డి,, సిద్ధవటం వైస్‌ఎంపీపీ శ్రీనువాసలరెడ్డి వైఎస్సార్‌సీపీ మహిళవిభాగం రాష్ట్ర ప్రధాకార్యదర్శి ఏకుల రాజేశ్వరీ రెడ్డి, మండలాల పార్టీ కన్వీనర్లు సిద్ధవరం గోపిరెడ్డి, టక్కోలు శివారెడ్డి, దొడ్డిపల్లె భాస్కర్‌రాజు, జె.కృష్ణారావు యాదవ్, రామస్వామిరెడ్డి, మణిరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు చొప్పా ఎల్లారెడ్డి, నల్లబోతుల ఈశ్వరయ్య,నడివీధి సుధాకర్, వడ్డెరమణ ,రహిమాన్‌ఖాన్, భూషణం,నరేష్, కే.వెంకటసుబ్బయ్య,చంద్రనాయక్,జయచంద్రరాజు,దండుగోపి, పెనుబాలనాగసుబ్బయ్య, జడ్మీటీసీ ఇస్మాయిల్, చైతన్య, మహిళనేతలు రక్కాసీ శ్రీవాణి, మిరియాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఆకేపాటి, సురేష్‌బాబు


