ఖాతా లేకున్నా రూ.2 వేల నోట్ల మార్పిడి | - | Sakshi
Sakshi News home page

ఖాతా లేకున్నా రూ.2 వేల నోట్ల మార్పిడి

May 24 2023 11:30 AM | Updated on May 24 2023 11:37 AM

- - Sakshi

రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకు రెండు వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకు రెండు వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదని, ఏ బ్యాంకులో అయినా రోజుకు రూ. 20 వేల వరకు మార్చుకోవచ్చని ఎల్‌డీఎం దుర్గాప్రసాద్‌ తెలిపారు. బ్యాంకుల్లో ఆధార్‌ వివరాలు నమోదు చేసుకుని రూ.2 వేల నోట్లకు బదులుగా ఇతర నోట్లు ఇస్తారన్నారు.

బ్యాంకు ఖాతాలకు పాన్‌కార్డు లింక్‌ అయి ఈకేవైసీ చేసుకుని ఉంటే బ్యాంకు ఖాతాలో రూ.2 వేల నోట్లు ఎంత మొత్తమైనా డిపాజిట్‌ చేసుకునే వీలుందన్నారు. అలాగే ఈ నోట్ల మార్పిడికి మాత్రం రోజుకు 10 నోట్లు అంటే రూ.20 వేల వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement