ఫ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సరిత
ఆలేరురూరల్: నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ సరిత అన్నారు. శనివారం ఆలేరు మండలం శారాజీపేట గ్రామ పంచాయతీలో విబీజీ రామ్జీ పథకంలో భాగంగా చేపడుతున్న జలసిరి పనులను పరిశీలించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్పాండ్ పనులను క్షేత్రస్థాయిలో సందర్శించి, పనుల పురోగతిపై ఆరా తీశారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించినా నీటి వనరులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ప్రణాళికలో గుర్తించిన పనులు, వ్యక్తిగత లబ్ధిదారులకు చేపడుతున్న పనులు, సామూహిక అవసరాల కోసం నిర్వహిస్తున్న పనుల వివరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మ్యాజిక్ సోక్పిట్లు, బోర్వెల్ రీచార్జ్ పనులు, ఫామ్పాండ్ నిర్మాణాల పురోగతిపై డిప్యూటీ కమిషనర్ సరిత సమీక్ష నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్తోపాటు విబీజీరామ్జీ సిబ్బందితో పనుల పురోగతి, అమలులో ఎదురవుతున్న సమస్యలు, భవిషత్తులో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆమె వెంట ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, సర్పంచ్ కంతి మధు, ఏపీఓ నవీన్, ఎంపీఓ అనురాధ, ఏపీఓ అరుణ, అధికారులు చారి, మానస, సుజాత, రేణుక తదితరులున్నారు.


