భువనగిరిలోని రైతు బజార్ పక్కన ఉన్న 999 గజాల స్థలంలో రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాం. కంట్రోల్ రూమ్ డేటా సెంటర్ అధినేత పిన్నపురెడ్డి శ్రీధర్‌రెడ్డి గారు దాతగా ఈ భవన నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయం. త్వరలోనే గౌరవ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నాం. ఈ నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంటుంది. మొదటి అంతస్తులో తలసేమియా బాధితులకు ప్రత్యేక చికిత్స విభాగం, రెండో అంతస్తులో ఆధునిక బ్లడ్ బ్యాంక్, బ్లడ్ కలెక్షన్ సెంటర్, క్లినికల్ ల్యాబ్ ఉంటుంది. మూడో అంతస్తులో కిడ్నీ బాధితుల కోసం 6 పడకల ఉచిత డయాలసిస్ సెంటర్, నాలుగవ అంతస్తులో రెడ్‌క్రాస్ జిల్లా పరిపాలనా కార్యాలయం ఉంటుంది. ఈ ల్యాబ్‌లకు కావాల్సిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వ సహకారంతో సమకూరుస్తున్నాం.


