మానసిక వైద్యం.. నామమాత్రం | - | Sakshi
Sakshi News home page

మానసిక వైద్యం.. నామమాత్రం

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

కౌన్సిలర్‌ నియామకానికి ప్రతిపాదనలు

- IIలో

భువనగిరి : జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని జిల్లా మెంటల్‌ హెల్త్‌ క్లినిక్‌ (మానసిక చికిత్స ఓపీ) సేవలు నామమాత్రంగా సాగుతున్నాయి. సిబ్బంది కొరత, వైద్యుల సమయపాలన లేమి తదితర కారణాలతో మానసిక రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కౌన్సిలర్‌ లేక..

నిబంధనల ప్రకారం ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు ఒక కౌన్సిలర్‌ ఉండాలి. కానీ ప్రస్తుతం కౌన్సిలర్‌ లేకపోవడంతో వైద్యులే రోగులకు కౌన్సిలింగ్‌ చేయాల్సి వస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలందించాల్సిన సిబ్బంది.. ఆలస్యంగా రావడం, ముందుగానే వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.

చికిత్స పొందుతున్నది 20 శాతమే..

కేవలం 15 నుంచి 20 శాతం మంది మానసిక రోగులు చికిత్స పొందుతున్నారు. ఇటీవల కోవిడ్‌–19 భయాలు, సామాజిక మాధ్యమాల్లోని ప్రచారాలతో మానసిక రోగుల సంఖ్య పెరుగుతోంది. సర్వేల ప్రకారం ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు, నలుగురు పెద్దల్లో ఒకరు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. భువనగిరి ఆస్పత్రికి నిత్యం 20 నుంచి 25 మంది (ఏడాదికి సుమారు 6 వేల నుంచి 7,500 మంది) వస్తున్నారు. సమస్య కాస్త తీవ్రంగా ఉన్న వారిని ఇక్కడ నయం చేసే అవకాశం లేక నేరుగా హైదరాబాద్‌కు రిఫర్‌ చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

ఫ భువనగిరి జనరల్‌ ఆస్పత్రిలో కౌన్సిలర్‌ పోస్టు ఖాళీ

ఫ వైద్యులపైనే పడుతున్న కౌన్సిలింగ్‌ భారం

ఫ సమస్య సీరియస్‌గా ఉంటే హైదరాబాద్‌కు రిఫర్‌

మానసిక చికిత్స ఓపీలో ప్రస్తుతం కౌన్సిలర్‌ పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. నియామకం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. అనుమతి రాగానే భర్తీ చేస్తాం. ఉన్న వైద్యులు రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.

– లక్ష్మణ్‌, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌,

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement