భువనగిరి (భువనగిరిటౌన్) : బీబీనగర్ ఆల్ ఇండి యా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అనాటమీ విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ అనాటమీ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంబీబీఎస్, ఎండీ (అనాటమీ) విద్యార్థులకు.. శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన, సృజనాత్మకత, శాసీ్త్రయ పరిశోధనా నైపుణ్యాలు వంటి పలు విద్యా సంబంధిత కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అమితా అగర్వాల్ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులకు శరీర నిర్మాణ శాస్త్రం పునాది వంటిదని పేర్కొన్నారు. మృతదేహాల విచ్ఛేదన (శవపరీక్ష/డిసెక్షన్) సమయంలో జిజ్ఞాసను ప్రదర్శిస్తూ, సామూహికంగా నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉత్తమ వైద్యులుగా రాణించవచ్చన్నారు. విద్యార్థుల కోసం జాతీయ స్థాయి ఈ–పోస్టర్ పోటీ అనాటోఆర్ట్ నిర్వహించారు. అలాగే అనాటోస్క్రిప్ట్ బూట్ క్యాంప్ పేరిట ప్రత్యేక వర్క్షాప్ను ఏర్పాటు చేశారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పాటు డీన్ (అకడమిక్స్) ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఫ ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్


