డ్రగ్స్‌కు దూరంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

చౌటుప్పల్‌, నార్కట్‌పల్లి : యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్‌ గురువారం చౌటుప్పల్‌ పట్టణంలో, నార్కట్‌పల్లి బస్టాండ్‌ వద్ద వినూత్నంగా ప్రచారం చేశారు. పిట్టలదొర వేషధారణలో పాటలు, పద్యాలు పాడుతూ డ్రగ్స్‌ వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల వలన జరిగే ప్రాణనష్టం గురించి కళ్లకు కట్టినట్టు చెప్పారు.

భర్త దశ దినకర్మ రోజే భార్య మృతి

మునుగోడు(చండూరు) : భర్త దశ దినకర్మ రోజే భార్య మృతిచెందింది. ఈ ఘటన చండూరు మండలం పుల్లెంల గ్రామంలో జరిగింది. పుల్లెంల గ్రామానికి చెందిన మెగుదాల పెంటయ్య(92) పది రోజలు క్రితం మృతిచెందాడు. గురువారం పెంటయ్య దశ దినకర్మ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అయితే పెంటయ్య భార్య మెగుదాల సాలమ్మ(84) గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. పదిరోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఫ పిట్టలదొర వేషధారణలో అవగాహన కల్పించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement