మోత్కూరు : కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా ఎంతో కీలకమని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ ఉదయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్సులో వెయ్యి రూపాయల బీమా చేయించుకున్న అడ్డగూడూరు మండలం బొడ్డుగూడేనికి చెందిన చుక్క భిక్షం (ఖాతాదారుడు) చెట్టు కూలి మృతి చెందడంతో నామినీ అయిన ఆయన భార్య చుక్క సరితకు బీమా సొమ్ము రూ.20 లక్షల చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడారు. తక్కువ మొత్తంతో బీమా చేయించుకున్నప్పటికీ ఆపద సమయంలో బాధిత కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో బీమా డబ్బులు ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిస్తాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్సు సీఎస్‌ఎం సతీష్, బీడీఎం శ్యామ్‌రెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.


