మోత్కూరు : రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ జూడో పోటీల్లో మోత్కూరు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ భవన్లో ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో మోత్కూరు ప్రాంతానికి చెందిన క్రీడాకారులు పతకాలు కై వసం చేసుకున్నట్లు జూడో కోచ్ అన్నెపు వెంకట్ మంగళవారం స్థానిక విలేకరులకు తెలిపారు. 23 కేజీల విభాగంలో ఎస్.నిత్య, 44 కేజీల విభాగంలో సిహెచ్.వీణ రజత పతకాలు .. ఎస్.రోషన్, డి.అశ్విత్, ఎ.సాత్విక ప్రశంసా పత్రాలు అందుకున్నారు. విద్యార్థులను జూడో ఫౌండర్ పి.బాలరాజు, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి కె.దశరథరెడ్డి కరాటే మాస్టర్లు బి.కార్తీక్, పి.మచ్చేందర్, పి.నిఖిల్, యు.మచ్చగిరి అభినందించారు.


