కాజీపేట రూరల్ : ఆలేరు వద్ద గల కొలనుపాక జైన్ టెంపుల్ 1400 సంవత్సరాల ఉత్సవాల నేపథ్యంలో 2027 ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు 5 రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నం–హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్–విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, 2027 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తాంబరం–హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్–తాంబరం ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 10న సికింద్రాబాద్–హిస్సర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆలేరులో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు.


