స్లాబ్‌.. ఇంచు పెరిగినా ఇబ్బందే.. | - | Sakshi
Sakshi News home page

స్లాబ్‌.. ఇంచు పెరిగినా ఇబ్బందే..

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే..

రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. పేదవారు సొంతింటి నిర్మాణంలో అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో గృహనిర్మాణ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నిర్దేశించిన స్లాబ్‌ విస్తీర్ణంలో నిబంధనలకు మించి ఒక ఇంచు పెరిగినా ఏఐ టెక్నాలజీ ఇట్టే పసిగట్టేస్తుంది.

నిర్మాణాలు ఆగొద్దనే సరికొత్త నిబంధనలు

ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల ఆర్థిక సాయంలోనే ఇల్లు పూర్తయ్యేలా స్లాబ్‌ విస్తీర్ణాన్ని నిర్దేశించారు. ఇల్లు కనీసం 500 చదరపు అడుగులకు తగ్గకుండా, గరిష్టంగా 750 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ప్లింత్‌ ఏరియాకు గరిష్టంగా 25 శాతం మాత్రమే స్లాబ్‌ ఏరియా పెంచుకోవడానికి అవకాశముంది. ఇంటి ముందు భాగంలో 3 ఫీట్లు, ఇరువైపులా, వెనుక భాగంలో ఒక్కో ఫీటు పెంచుకుంటే సరిపోతుంది. ఇష్టానుసారంగా విస్తీర్ణం పెంచితే నిర్మాణ వ్యయం ఎక్కువై, ఇళ్లు అర్ధాంతరంగా నిలిచిపోతాయనే భావనతోనే ఈ నిబంధనలు తీసుకువచ్చారు. ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టనివారికి, కొత్తగా గ్రౌండింగ్‌ చేస్తున్న వారికి, బేస్‌మెంట్‌ లెవల్‌, రూఫ్‌ లెవల్‌లో ఉన్న ఇళ్లకు, కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి ఈ మార్గదర్శకాలను వర్తింపజేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ముగ్గుపోసిన ప్రదేశంలో లొకేషన్‌ తీసుకుని అప్‌లోడ్‌ చేస్తారు. కొలతల విషయంలో చిన్న తప్పిదం జరిగినా ఏఐ ఇట్టే పట్టేస్తుంది.

అర్హుల ఎంపికలో పారదర్శకత

ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటిదశలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రెండవ విడత అమలు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆధార్‌లింక్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపు. ఫోర్‌ వీలర్‌ వాహనాలు, భూ వివరాలు తెలుసుకోవడం ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు దోహదపడుతుంది. రెండవ విడతలో గుడిసెల్లో నివసిస్తూ నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నారు. పటిష్టమైన గోడలు కలిగి రేకులు లేదా పెంకుల కప్పు కలిగిన వారు స్లాబ్‌ వేసుకోవడానికి ముందుకు వచ్చే వారికి రెండవ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

మొదటి దశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా మంచి పురోగతి సాధించింది. వివిధ దశల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇంటి ముందు కిటికీలకు వర్షం, ఎండ పడకుండా తక్కువ ఖర్చుతో జీఐ షీట్లు వేసుకుంటే మంచిది.

– అలివేలు, హౌసింగ్‌ పీడీ, యాదాద్రి భువనగిరి

మొదటి దశ

మంజూరైన ఇళ్లు : 9,618

నిర్మాణం మొదలు పెట్టినవి : 8,121

పూర్తయిన ఇళ్లు : 5,420

రెండవ దశ

నియోజకవర్గానికి : 2000

ఒక్కో నియోజకవర్గానికి రూఫ్‌

రిప్లేస్‌మెంట్‌కు : 500 ఇళ్లు

(లబ్ధిదారుడికి రూ.2లక్షల ఆర్థికసాయం)

ఫ ఏఐ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

ఫ గరిష్టంగా 750 చదరపు అడుగులకే పరిమితి

ఫ అప్పులపాలు కాకూడదనే కొత్త మార్గదర్శకాలు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement