దవాఖానాకు వస్తే డాక్టర్ రాలేదు
గుండాల : గ్రామీణ ప్రాంత మహిళలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి మంగళవారం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యులు మహిళలకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేయాలి. కానీ గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. ప్రతి మంగళవారం విధులకు హాజరుకావాల్సిన డాక్టర్ రాకపోవడం, రోగులను పరీక్షించకపోవడం సర్వసాధారణమైంది.
ఎంఎల్‌హెచ్‌పీల ద్వారా వైద్యం
ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్ రాకపోవడంతో, వైద్యం అందించాల్సిన బాధ్యతను ఎంఎల్‌హెచ్‌పీలు నిర్వర్తించాల్సి వస్తోంది. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్‌తో చెప్పుకుని, పరీక్షలు చేయించుకుని మందులు తీసుకెళ్దామని ఎన్నో ఆశలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు.. వైద్యురాలు లేకపోవడంతో చేసేదేమీ లేక వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న ఈ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు
అధికారుల పర్యవేక్షణ లోపం
క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటమే వైద్యుల నిర్లక్ష్యానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి రాకుండా విధులకు గైర్హాజరవుతున్న ఆ డాక్టర్‌పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
డాక్టర్ రాదు.. నాడీ పట్టదు
ఫ గుండాల పీహెచ్‌సీలో ప్రతి మంగళవారం అమలుకునోచని ఆరోగ్య మహిళ
ఫ నిరాశతో వెనుదిరిగిపోతున్న రోగులు
ఊపిరి పీల్చుకున్నప్పుడు ఛాతీలో నొప్పి వస్తోందని చూపించుకోవడానికి ప్రభుత్వ దవాఖా నాకు వస్తే డాక్టర్ రాలేదు. దవాఖానాలో బీపీ చెక్ చేసి మందులు ఇచ్చారు. కానీ నాడి పట్టి చూడలేదు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి వచ్చి మా సమస్యలు చెప్పుకుందామంటే డాక్టర్ లేక పోవడంతో వెళ్లి పోతున్నాం.
– చంద్రగిరి విజయ, గంగాపురం


