షూటింగ్‌ బాల్‌ పోటీల్లో జిల్లా జట్టు ప్రథమ స్థానం | - | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ బాల్‌ పోటీల్లో జిల్లా జట్టు ప్రథమ స్థానం

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

భువనగిరి: మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండల కేంద్రంలో ఈనెల 10,11,12 తేదీల్లో నిర్వహించిన 45వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మంగళవారం క్రీడాకారులతో పాటు షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదయ్యను జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో జిల్లా అధికారి కె. ధనుంజనేయులు సన్మానించారు.

ఆంజనేయస్వామికి ఆకుపూజ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి క్షేత్రపాలకుడిగా కొనసాగుతున్న శ్రీఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం కొండపైన పుష్కరిణి వద్ద, ఆలయ ముఖ మండపం వద్ద ఉన్న క్షేత్రపాలకుడికి అర్చకులు సంప్రదాయంగా పూజలు జరిపించారు. పాలు, సింధూరం, పంచామృతాలతో అభిషేకం చేసి తమలపాకులతో అర్చన నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. ఇక ఆలయంలో నిత్య కై ంకర్యాలను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు.

గ్రంథాలయాల అభివృద్ధే ధ్యేయం

భువనగిరిటౌన్‌ : గ్రంథాలయాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఎండీ అవెస్‌ ఉర్‌ రహమాన్‌ చిస్తీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన అధ్యక్షతన గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, సంస్థ కార్యదర్శి ఎస్‌. వంశీకృష్ణ పాల్గొని గ్రంథాలయాల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. విద్యార్థుల్లో పఠనాభిలాష పెంచేందుకు జిల్లాలోని 18 పాఠశాలల్లో నూతన గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని .. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సంపూర్ణంగా డిజిటలైజేషన్‌ చేయాలని తీర్మానించారు. వలిగొండ గ్రంథాలయానికి భవన నిర్మాణం, తుర్కపల్లి గ్రంథాలయ స్థలానికి ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. పోచంపల్లి, రాజపేట, నారాయణపురం, రామన్నపేట, ఆలేరుగ్రంథాలయాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రంగులు వేయించడం, నిబంధనల ప్రకారం పాత దిన, వారపత్రికలను వేలం వేయాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement