డిజిటల్‌ క్రాప్‌ సర్వే 93 శాతం | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ క్రాప్‌ సర్వే 93 శాతం

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

రైతులకు మేలు

రామన్నపేట: రైతులు సాగు చేసిన పంటల వాస్తవ వివరాలను సేకరించేందుకు చేపట్టిన డిజిటల్‌ క్రాప్‌ సర్వే తుదిదశకు చేరింది. జిల్లాలో మొత్తం 8,93,481 ప్లాట్లకు గాను ఇప్పటివరకు 8,29,924 (93శాతం) ప్లాట్లలో సర్వే పూర్తయింది. వలంటీర్లు నేరుగా పొలాల వద్దకు వెళ్లి, యాప్‌లో ఫొటోలతో సహా పంట వివరాలను నమోదు చేస్తున్నారు.

అత్యధికంగా సర్వే పూర్తయిన మండలాలు

రాజాపేట మండలంలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే వందశాతం, గుండాలలో 99శాతం. మోటకొండూరు, ఆత్మకూరు(ఎం), బీబీనగర్‌లలో 98శాతం సర్వే పూర్తయ్యింది. వలంటీర్‌ నమోదు చేసిన వెంటనే రైతు ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. నమోదులో ఏవైనా పొరపాట్లు ఉంటే, మెసేజ్‌ వచ్చిన 72 గంటల లోపు వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి సవరించుకోవచ్చు.

ప్రయోజనాలు

ధాన్యం కొనుగోలు సమయంలో వచ్చే వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పంట రుణాలు, బీమా, ప్రకృతి వైపరీత్యాల పరిహారం త్వరగా అందుతాయి. విత్తనాలు, ఎరువుల అవసరాలను కచ్చితంగా అంచనా వేయవచ్చు.

ఫ తుదిదశకు పంటల సర్వే

ఫ రాజాపేటలో వందశాతం పూర్తి

ఫ వివరాల సవరణకు 72 గంటల వ్యవధి

డిజిటల్‌ క్రాప్‌ సర్వే వల్ల రైతులకు చాలా మేలు కలుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తెలిపారు. పంటలను అమ్ముకునే సమయంలో ఏ విధమైన ఇబ్బంది కలుగదన్నారు. ఫొటోతో సహా పంటల వివరాలు నమోదు చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు.

– జిల్లా వ్యవసాయాధికారి వెంకటరమణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement