యాదగిరిగుట్ట: యాదగిరి కొండపైన అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పూజారులు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం మూడవ రోజు కావడంతో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాతః కాల పూజ, అర్చనలు, పారాయణాలు, శ్రీదేవి మూలమంత్ర జపములు, సహస్రనామార్చన, నవావరణ పూజ, సహస్రనామార్చనలు, మంత్ర పుష్పాలు వంటి పూజలు నిర్వహించారు.


