బీసీలు మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య పిలుపినిచ్చారు.
- 8లో
వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వద్దు
భువనగిరి: జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు–వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు పై వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గర్భిణుల నమోదు, ఏఎన్సీ పరీక్షలు, ప్రసవానంతరం సేవలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ప్రతి వైద్యాధికారి తమ పరిధిలో ఉన్న ఆస్పత్రులను పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ పాల్గొన్నారు.


